ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీ(Harverd University)పై అమెరికా అధ్యక్షుడు(America President) ఆంక్షలు విధిస్తోన్నారు. నిధులను నిలిపివేస్తోన్నారు. ఇదివరకు 2.3 బిలియన్ డాలర్ల మేర నిధులను కోతపెట్టారు. నిన్నటికి నిన్న 100 మిలియన్ డాలర్ల కాంట్రాక్టునూ రద్దు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి గల కారణాలను వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్. వైట్ హౌస్(White House) లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హార్వర్డ్ యూనివర్శిటీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడి పరిపాలన విధానం, అడ్మిషన్ల ప్రక్రియపై విమర్శలు చేశారు. విదేశీ విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వడాన్నీ తప్పుపట్టారు.
విదేశీ విద్యార్థులు ట్రబుల్ మేకర్స్
హార్వర్డ్‌లో చేరిన చాలామంది విదేశీ విద్యార్థులు ట్రబుల్ మేకర్స్ గా అభివర్ణించారు ట్రంప్. దేశాన్ని అస్తవ్యస్తం చేస్తోన్నారని మండిపడ్డారు. అమెరికా.. షాపింగ్ సెంటర్ గా మారుతోందని వ్యాఖ్యానించారు. షాపింగ్ కేంద్రాలు విదేశీ విద్యార్థులతో నిండిపోవడాన్ని చూడాలనుకోవట్లేదని తేల్చి చెప్పారు. రాడికల్, వామపక్ష భావజాలంతో అల్లర్లకు కారణమౌతోన్నారంటూ ఆరోపించారు. హార్వర్డ్ యూనివర్శిటీ- ప్రతి సంవత్సరం దాదాపు 31 శాతం మంది విదేశీ విద్యార్థులను చేర్చుకుంటుందని, వారిలో కొందరు రాడికలైజ్డ్ ప్రాంతాల నుండి వచ్చారని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
మన దేశంలో ఇబ్బంది కలిగిస్తున్నారు
విదేశీ విద్యార్థుల గురించి ఆరా తీయాలనే ఉద్దేశంతోనే వారి రికార్డులు ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించినట్లు ట్రంప్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఎక్కడి నుంచో వచ్చిన వామపక్ష భావజాలం గల విద్యార్థులు మన దేశంలో ఇబ్బంది కలిగించడం తనకు ఎంతమాత్రమూ ఇష్టం లేదని స్పష్టం చేశారు. హార్వర్ యూనివర్శిటీ ఓ యాంటీ- సెమిటిక్ గా వ్యవహరిస్తోందని ట్రంప్ ధ్వజమెత్తారు. ఓ గ్రేట్ డిజాస్టర్ గా మారుతోందనీ విమర్శించారు. కొన్ని కాలేజీలు కూడా ఇలాగే తయారవుతున్నాయని, వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Read Also: Elon Musk : డోజ్ పదవికి మస్క్ రాజీనామా