📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Maria Jose: కొలంబియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను కాల్చి చంపిన గుర్తుతెలియని వ్యక్తి

Author Icon By Vanipushpa
Updated: May 19, 2025 • 10:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డెలివరీ బాయ్ వేషంలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఒకరు 22 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌(Social Media Influencer)ను ఆమె ఇంటి బయటే కాల్చి చంపాడు. కొలంబియాలోని కుకుటా నగరంలో లా రివియేరా ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో జరిగిందీ ఘటన. డెలివరీ బాయ్ వేషంలో వచ్చిన వ్యక్తి 22 ఏళ్ల మరియా జోస్ ఎస్తుపినాన్ సాంచెజ్‌(Maria Jose Estupinan Sanchez)పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. దుండగుడు కాల్పులు జరిపిన వెంటనే సాంచెజ్(Sanchez) సహాయం కోసం గట్టిగా కేకలు వేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కాల్పులు జరిపిన తర్వాత సాంచెజ్ ఇంటి నుంచి నిందితుడు వేగంగా పారిపోతున్నట్టు ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. ‘ఒక వ్యక్తి ప్యాకేజీ డెలివరీ చేస్తున్నట్టు నమ్మించి ఆమెను హత్య చేశాడు’ అని పోలీసులు తెలిపారు.

Maria Jose: కొలంబియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను కాల్చి చంపిన గుర్తుతెలియని వ్యక్తి

మాజీ ప్రియుడిపై అనుమానాలు
ఈ దాడి జరగడానికి ఒక రోజు ముందే సాంచెజ్ తన మాజీ ప్రియుడిపై పెట్టిన గృహహింస కేసులో విజయం సాధించినట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ కేసులో భాగంగా ఆమెకు 30 మిలియన్ కొలంబియన్ పెసోలు (సుమారు 7,000 అమెరికన్ డాలర్లు) పరిహారంగా లభించాయి. కోర్టులో కేసు గెలవడమే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని, దీని వెనుక మాజీ ప్రియుడి హస్తం ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే, ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేసినట్లు అధికారికంగా ప్రకటించలేదు. నల్ల టోపీ, జాకెట్, జీన్స్ ధరించి, వీపున బ్యాగ్ తగిలించుకున్న ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇలాంటిదే మరో ఘటన
కొద్ది రోజుల క్రితం మెక్సికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ వలేరియా మార్క్వెజ్ కూడా లైవ్ స్ట్రీమ్‌లో ఉండగా ఇదే తరహాలో హత్యకు గురవడం గమనార్హం. ఆమెను కూడా డెలివరీ బాయ్ వేషంలో వచ్చిన వ్యక్తే లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ హత్యను ‘ఫెమిసైడ్’ (మహిళల హత్య)గా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Dr. Mark E. Rupp : కొత్త వ్యాక్సిన్ కు అమెరికా గ్రీన్ సిగ్నల్ : కరోనా

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Colombian influencer Google News in Telugu Latest News in Telugu Paper Telugu News shoots and kills Telugu News online Telugu News Paper Telugu News Today Today news Unknown man

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.