📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pahalgam Attack: పహల్గామ్‌ దాడిలో వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు

Author Icon By Vanipushpa
Updated: May 1, 2025 • 12:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడికి రెండు రోజుల ముందు ఉగ్రవాదులు బైసరన్ లోయలో ఉన్నట్టు తాజాగా ఆధారాలు లభ్యమయ్యాయి. ఉగ్రదాడిలో అరెస్టైన ఓవర్ గ్రౌండ్ వర్కర్లు (OGWs)లో ఒకరు విచారణలో ఈ విషయం బయటపెట్టినట్టు సమాచారం. ప్రముఖ నిఘా అధికారుల ప్రకారం.. ఉగ్రవాదులు ఏప్రిల్ 15న పహల్గామ్‌కు చేరుకుని కనీసం నాలుగు ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించారు. వీటిలో బైసరన్ లోయతో పాటు అరూ వాలీ, లోకల్ అమ్యూజ్‌మెంట్ పార్క్, బీటాబ్ వ్యాలీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కఠినమైన భద్రతా చర్యల కారణంగా ఉగ్రవాదులు అక్కడ దాడి చేయలేకపోయారని తెలుస్తోంది. కాగా, పహల్గామ్‌‌లో దాడికి ఒక రోజు ముందు ఓ ఉగ్రవాది.. పర్యాటకుడితో మాట్లాడిన విషయం తెలిసిందే. పహల్గామ్ దాడికి రెండు రోజుల ముందు, ఉగ్రవాదులు బైసరన్ లోయలో ఉన్నట్టు తాజా ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.

విదేశీ ఉగ్రవాదులకు గ్రౌండ్ వర్కర్లు సహాయం
మరోవైపు, కశ్మీర్‌లో ముష్కరల కోసం సైన్యం వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో దాడికి సహకరించిన స్థానిక ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేశారు. పహల్గామ్ దాడిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. విదేశీ ఉగ్రవాదులకు దాదాపు 20మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లు సహాయం చేసినట్టు గుర్తించారు. వీరిలో కొంతమంది ఇప్పటికే అరెస్టు కాగా.. మిగతావారి కోసం గాలిస్తున్నారు. నిఘా సంస్థల సమాచారం ప్రకారం.. కనీసం నలుగురు ఓజీడబ్ల్యూలు ఉగ్రవాదులకు రెక్కీ, లాజిస్టికల్ సపోర్ట్ వంటి కీలక సహాయాన్ని అందించారు. దాడికి ముందు ఈ ప్రాంతంలో మూడు శాటిలైట్ ఫోన్ల వినియోగం జరిగినట్టు ఆధారాలు లభించాయి. వీటిలో రెండు ఫోన్ల సిగ్నల్స్‌ను ట్రేస్ చేయగలిగారు.
నియంత్రణ రేఖ వద్ద కాల్పులు
పాకిస్తాన్ లో భద్రతా పరంగా సవాళ్లతో కూడిన బెలూచిస్తాన్, దక్షిణ వజీరిస్తాన్ ప్రావిన్స్ లలో పనిచేసిన అనుభవం ఆసిమ్ మాలిక్ కు ఉంది. ప్రస్తుతం భారత్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు లేకపోయినా నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ నిత్యం కాల్పులు జరుపుతూనే ఉంది. అలాగే వచ్చే 24-36 గంటల్లో భారత్ తమపై సైనిక దాడి చేయొచ్చని తమకు పక్కా నిఘా సమాచారం ఉందంటూ పాకిస్తాన్ మంత్రి అతావుల్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆసిమ్ మాలిక్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఈ దర్యాప్తులో మరిన్ని కీలక ఆధారాలు కనుగొనవచ్చునని ఆశిస్తున్నారు. 20 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లు విదేశీ ఉగ్రవాదులకు సహాయం చేసినట్టు గుర్తించబడ్డారు.
వీరిలో కొంతమంది ఇప్పటికే అరెస్టు చేయబడ్డారు, మిగతా వారు గాలింపు చర్యలలో ఉన్నారు.
కనీసం నలుగురు OGWs ఉగ్రవాదులకు రెక్కీ, లాజిస్టికల్ సపోర్ట్ అందించారు.
ఈ ప్రాంతంలో మూడు శాటిలైట్ ఫోన్ల వినియోగం జరిగినట్టు ఆధారాలు లభించాయి, వాటిలో రెండు ఫోన్ల సిగ్నల్స్‌ను ట్రేస్ చేయగలిగారు.

Read Also: In-Pakistan: భారత్ పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు .. చైనా దారి ఎటు?

#telugu News Ap News in Telugu Breaking News in Telugu come to light Google News in Telugu Latest News in Telugu Pahalgam Attack Paper Telugu News Shocking facts Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.