ప్రస్తుతం అమెరికాలో పర్యటనలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో మూడో పక్షం జోక్యం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.ఆయన ప్రస్తుతం అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్’ గురించి రాహుల్ గాంధీ చేసిన ‘నరేంద్ర మోదీ సరెండర్’ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు థరూర్(Shashi Tharoor) బదులిచ్చారు.రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పడంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పదేపదే చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా థరూర్ ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. “ఆపరేషన్ సిందూర్ ను ఆపడానికి భారత్‌ను ఎవరూ ఒప్పించాల్సిన అవసరం రాలేదు. మమ్మల్ని ఆపమని ఎవరూ చెప్పనక్కర్లేదు, ఎందుకంటే పాకిస్థాన్ ఆపిన మరుక్షణమే మేమూ ఆపడానికి సిద్ధంగా ఉన్నామని వారికే (పాకిస్థాన్‌కు) మేం చెప్పాం” అని ఆయన వివరించారు.
నిర్ణయాత్మక ప్రక్రియ
మీడియాతో మాట్లాడుతూ,పాకిస్థాన్‌తో అమెరికా ఇలా చెప్పివుంటే బావుండేది, ఏంటంటే, ‘భారత్ ఆగడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు కూడా ఆగడం మంచిది’ అని చెప్పి ఉంటే అది వారి గొప్పతనం అవుతుందని థరూర్ అభిప్రాయపడ్డారు. “వారు (అమెరికా) అదే చేసి ఉంటే, అది వారి వైపు నుంచి ఒక అద్భుతమైన చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, నిర్ణయాత్మక ప్రక్రియలో మాత్రం భారత్(India) స్వతంత్రంగానే వ్యవహరించిందని, బయటి శక్తుల ప్రమేయం లేదని థరూర్ తేల్చిచెప్పారు.
Read Also: Jobs : CISFలో 403 ఉద్యోగాలు.. రేపే లాస్ట్