📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Shashi Tharoor: అనవసరంగా మా జోలికి రావొద్దని పాక్ ను హెచ్చరించిన శశిథరూర్

Author Icon By Anusha
Updated: June 3, 2025 • 10:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం, పాకిస్థాన్‌ను భారత్‌లో విలీనం చేసుకోవాలనే ఉద్దేశం తమకు లేదని, సరిహద్దు ఉగ్రవాదం లేని శాంతి, శ్రేయస్సును మాత్రమే కోరుకుంటున్నామని స్పష్టం చేసింది. బ్రెజిల్‌(Brazil)లో పర్యటిస్తున్న అఖిలపక్ష భారత పార్లమెంటరీ ప్రతినిధుల బృందం నేడు ఆ దేశ ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు అత్యంత ఫలవంతంగా ముగిశాయి. బ్రెజిల్ ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లోని విదేశీ వ్యవహారాలు, జాతీయ రక్షణ కమిటీ అధ్యక్షుడు ఫిలిపే బారోస్‌తో భారత నేతలు సమావేశమయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌కు బ్రెజిల్ మద్దతు ఉంటుందని బారోస్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శశి థరూర్(Shashi Tharoor) మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని తీవ్రంగా విమర్శించారు.మేము పాకిస్థాన్‌ను ఆక్రమించుకోవాలని(OR) భారత్‌లో భాగం చేసుకోవాలని అనుకోవడం లేదు. మమ్మల్ని ప్రశాంతంగా వదిలేస్తే మా ప్రజల శ్రేయస్సు, అభివృద్ధిపై దృష్టి పెడతాం. శతాబ్దాలుగా ఇదే భారత దేశ విధానం. మాకు యుద్ధాలు, ఘర్షణలు ఎందుకు కావాలి? అవన్నీ అవతలి వైపు నుంచే వస్తున్నాయి” అని థరూర్ అన్నారు. “మేము ఈ చర్య ఎందుకు తీసుకున్నామో ప్రపంచం అర్థం చేసుకోవాలి, మాకు వేరే దారి లేదు. మీరు (పాకిస్థాన్) మమ్మల్ని వదిలేస్తే, మేము మిమ్మల్ని వదిలేస్తాం. కానీ ఉగ్రవాదంతో మమ్మల్ని గాయపరిస్తే, ఇలాగే బదులిస్తాం” అని ఆయన హెచ్చరించారు.  

సంప్రదాయ

సబ్-కన్వెన్షనల్ వార్‌ఫేర్ అనే పదం ఉంది. ఇది చాలా నీచమైన పద్ధతి, ఎందుకంటే వారు (పాకిస్థాన్) పౌరులు, అమాయకులను లక్ష్యంగా చేసుకుంటారు. సంప్రదాయ యుద్ధంలో మమ్మల్ని ఓడించలేరు, అందుకే ఇలాంటివి ప్రయత్నిస్తారు. మేము ఉగ్రవాదాన్ని నమ్మం, కానీ వారు ఉగ్రవాదులతో దాడి చేస్తే, మేము సంప్రదాయ యుద్ధంతో బదులిస్తాం. మా వాయుసేన, సైన్యం, నౌకాదళాన్ని ఉపయోగిస్తాం. వారి స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటాం, కాబట్టి వారు అర్థం చేసుకోవాలి. దీన్ని ఆపేందుకు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద(Terrorism) మౌలిక సదుపాయాలను కూల్చివేయడం, నేరస్థులను అరెస్టు చేయడం ఒక్కటే మార్గం. కానీ వారు అలా చేయరు. ఎందుకంటే దురదృష్టవశాత్తు పాకిస్థాన్ దేశం అలా తయారైంది” అని థరూర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Shashi Tharoor

వ్యతిరేకంగా

మహాత్మా గాంధీ శాంతి కోసం కశ్మీర్‌ను వదులుకునేవారా? అని బ్రెజిల్ అధికారి ఒకరు అడిగిన ప్రశ్నకు థరూర్ గట్టిగా బదులిస్తూ “ఏ భారతీయ నాయకుడైనా అలా చేస్తారని నేను అనుకోను. తలపై తుపాకీ గురిపెట్టిన వారికి లొంగిపోవాలని మహాత్మా గాంధీ ఎప్పుడూ కోరుకోలేదు. బ్రిటిష్ వారు తమ పోలీసులు లేదా తుపాకులతో వచ్చినప్పుడు, వారికి వ్యతిరేకంగా నిటారుగా నిలబడాలనే సందేశాన్ని మాకు నేర్పించారు. గాంధీ చాలా కఠినమైన స్థితిలో ఉన్నారు, చాలా మంది గాయపడ్డారు, కొందరు ప్రాణాలు కోల్పోయారు. మన జాతీయ హీరోలలో ఒకరైన లాలా లజపత్ రాయ్‌(Lala Lajpat Rai)ను ఒక బ్రిటిష్ అధికారి తన రైఫిల్‌తో తలపై కొట్టారు. మన జాతీయ వీరులు హింసను ప్రతిఘటించారు. మహాత్మా గాంధీ బ్రిటిష్ వారికి లొంగిపోయినట్టు ఎప్పుడూ అంగీకరించలేదు. నేటి భారత్ కూడా లొంగిపోదు. మేము లొంగిపోతామని పాకిస్థాన్ అనుకుంటే క్షమించండి, మేము లొంగిపోము” అని స్పష్టం చేశారు.

Read Also: Canara Bank : కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ చోరీ..

#AntiTerrorStand #IndiaBrazilRelations #IndiaPakistan #ShashiTharoor Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.