📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Shahid Afridi: షాహిద్ అఫ్రిదిని మేం పిలవలేదు..కుబా వివరణ

Author Icon By Anusha
Updated: May 31, 2025 • 5:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాక్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్‌లకు దుబాయ్‌లోని ఓ కేరళ పూర్వ విద్యార్థుల సంఘం ఆతిథ్యమివ్వడం వివాదాస్పదమైంది. గతంలో భారత్‌పైనా, భారత సైన్యంపైనా అఫ్రిది పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, కొచ్చిన్ యూనివర్సిటీ బీటెక్ పూర్వ విద్యార్థుల సంఘం (కుబా) దుబాయ్‌లోని పాకిస్థాన్ అసోసియేషన్ (పీఏడీ)లో గతవారం నిర్వహించిన కార్యక్రమానికి వీరిని ఆహ్వానించడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి.ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమం(Social media)లో వైరల్ అయింది. ఇందులో షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్ వేదికపైకి వస్తుండగా, కొందరు “బూమ్ బూమ్” అంటూ నినాదాలు చేయడం కనిపించింది. దీనికి అఫ్రిది “హోగయా బూమ్ బూమ్” అంటూ స్పందించారు.

నెటిజన్లు

పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించిన ఘటన తర్వాత, భారత భద్రతా బలగాల సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ అఫ్రిది(Shahid Afridi) చేసిన వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. కశ్మీర్‌లో 8 లక్షల మంది సైన్యం ఉన్నా ఇలా జరిగిందంటే, మీరు అసమర్థులు, పనికిరాని వారని అఫ్రిది వ్యాఖ్యానించారు.ఈ నేపథ్యంలో, భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి కేరళ సంఘం(Kerala Association) స్వాగతం పలకడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సరిహద్దుల్లో సైనికులు పోరాడుతుంటే, కొందరు పాక్ క్రీడాకారులను వేడుక చేసుకుంటున్నారని విమర్శించారు.

Shahid Afridi: షాహిద్ అఫ్రిదిని మేం పిలవలేదు..కుబా వివరణ

సమాచారం

విమర్శలు వెల్లువెత్తడంతో ‘కుబా’ ఒక ప్రకటన విడుదల చేసింది. మే 25న తాము కార్యక్రమం నిర్వహిస్తున్న అదే ప్రాంగణంలో మరో కార్యక్రమంలో భాగంగా పాక్ క్రికెటర్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్(Guinness World Record) కోసం వచ్చారని తెలిపింది. తమ కార్యక్రమం ముగిసే సమయంలో, అఫ్రిది, గుల్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ఆహ్వానం లేకుండానే తమ వేదిక వద్దకు వచ్చారని కుబా స్పష్టం చేసింది. తమ ఆర్గనైజింగ్ టీమ్(Organizing Team) సభ్యులు గానీ, అధికారులు గానీ, పూర్వ విద్యార్థులు గానీ వారిని ఆహ్వానించలేదని, వారి రాకను సమన్వయం చేయలేదని కుబా ఆ ప్రకటనలో పేర్కొంది.

Read Also: /Bihar CM: మోదీ పేరును మర్చిపోయిన నితీష్ కుమార్

#GuinnessWorldRecord #KUBAClarification #ShahidAfridi #UmarGul Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.