📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

IAS Ashok Khemka: బదిలీలతో సీనియర్ ఐఏఎస్ అశోక్‌ ఖేమ్కా సంచలనం

Author Icon By Vanipushpa
Updated: April 30, 2025 • 4:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దాదాపు 34 సంవత్సరాల తన సర్వీస్‌లో 57 బదిలీలతో విశేష గుర్తింపు పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా దేశవాసులందరికీ సుచరిచితమే. అశోక్ ఖేమ్కా ఎట్టకేలకు తన కెరీర్‌కు ముగింపు పలకను న్నారు. ప్రస్తుతం హరియాణా రవాణా శాఖ విభాగం అడిషన్‌ చీఫ్‌ సెక్రటరీ హోదాలో విధులు నిర్వహిస్తున్న ఖేమ్కా బుధవారం (ఏప్రిల్ 30) పదవీ విరమణ పొందనున్నారు. ఆయన 2024 డిసెంబర్‌లో ఈ పదవిలో చేరారు. ఈ పదవిలో ఆయన 4 నెలలు మాత్రమే ఉన్నారు. 1991 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ఖేమ్కా హర్యానా కేడర్ అధికారి. తన 34 ఏళ్ల కెరీర్‌లో ఏకంగా 57 సార్లు బదిలీ అయ్యారు. సగటున ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆయన బదిలీ అవుతుండటం విశేషం. బహుశా హర్యానాలో ఏ అధికారికీ చేయని అత్యధిక బదిలీలు ఇదే.

నాలుగు నెలలకే బదిలీ
2012లో కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన గురుగ్రామ్ భూ ఒప్పందం మ్యుటేషన్‌ను రద్దుతో జాతీయ స్థాయిలో ఖేమ్కా పేరు ఒక్కసారిగా మోగిపోయింది. తన సర్వీస్‌లో తొలిసారి మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ రవాణా కమిషనర్‌గా ఉన్న ఖేమ్కాని కేవలం నాలుగు నెలలకే బదిలీ చేసింది. దాదాపు పదేళ్ల తర్వాత గత డిసెంబర్‌లో రవాణా శాఖకు తిరిగి అధికారిగా వచ్చారు. గత 12 సంవత్సరాలలో ఖేమ్కాను ఎక్కువగా ‘లో-ప్రొఫైల్’ గా పరిగణించబడే విభాగాలకు అధికంగా కేటాయించారు. ఒక్క ఆర్కైవ్స్ విభాగానికే 2013లో ఒకసారి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మూడుసార్లు, బీజేపీ పాలనలో నాలుగుసార్లు పోస్టింగ్ పొందారు. అందులో మొదట డైరెక్టర్ జనరల్‌గా, తరువాత ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు.
కొత్త సంకల్పంతో పట్టుదలతో ఉంటాను
2023లో ఖేమ్కా రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి తనను బదిలీ చేయాలని కోరుతూ ఖట్టర్‌కు లేఖ రాశారు. అందులో అవినీతిని నిర్మూలించాలనే తన కోరికను వ్యక్తం చేశారు. జనవరి 23, 2023 నాటి తన లేఖలో బ్యూరోక్రసీలో పక్షపాత పని పంపిణీని ఆయన దయ్యబట్టారు. కొంతమంది అధికారులపై అధిక భారం ఉందని, తనతో సహా ఇతర అధికారులకు ఆర్కైవ్స్ వంటి పెద్దగా పనిలేని విభాగాలలో కేటాయించడాన్ని తప్పుబట్టారు. కనీసం తన సర్వీస్‌ చివరి రోజుల్లోనైనా అవినీతిని రూపుమాపాలనే తన కలను నెరవేర్చుకోవడానికి విజిలెన్స్ విభాగానికి తనను బదిలీ చేయాలని కోరారు.

తనకు అవకాశం ఇస్తే, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని, ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా చేస్తానని అన్నారు. అయితే రెండేళ్ల క్రితం ఐఏఎస్ అధికారుల పదోన్నతుల తర్వాత ఖేమ్కా ఆసక్తికర ట్వీట్ చేశారు. అందులో..’భారత ప్రభుత్వానికి కొత్తగా కార్యదర్శులుగా నియమితులైన నా బ్యాచ్‌మేట్‌లకు అభినందనలు! ఇది ఆనందించవల్సిన సందర్భమే అయినప్పటికీ, మనలో ఒకరు వెనుకబడిపోయారనే నిరాశను కూడా మిగిల్చింది’అని పేర్కొన్నారు. నిటారుగా ఉన్న చెట్లనే ముందు నరికివేస్తారు. ఎటువంటి విచారం లేదు. కొత్త సంకల్పంతో పట్టుదలతో ఉంటాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Pahalgam Terror Attack: శౌర్యచక్ర అవార్డు గ్రహీత తల్లి పాకిస్తాన్ కు వెళ్తున్న వార్తల్లో నిజం లేదు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu creates sensation Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Senior IAS Ashok Khemka Telugu News online Telugu News Paper Telugu News Today Today news with transfers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.