📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Contact Lenses: లెన్స్‌లపై శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ!

Author Icon By Vanipushpa
Updated: May 23, 2025 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మానవ కంటికి అందని సమీప పరారుణ కాంతిని కూడా చూడగలిగే విప్లవాత్మక కాంటాక్ట్ లెన్స్‌(Contact Lenses)లను చైనా శాస్త్రవేత్తల(China Scientist) నేతృత్వంలోని ఓ అంతర్జాతీయ(International) బృందం అభివృద్ధి చేసింది. ఈ కొత్త కాంటాక్ట్ లెన్స్‌(Contact Lenses)ల సాయంతో ఇక చీకటి, పొగమంచులోనూ అన్నీ స్పష్టంగా చూడగలిగే వీలుంటుంది. ఈ సరికొత్త ఆవిష్కరణ వైద్యరంగంలో ఇమేజింగ్ ప్రక్రియలను, దృష్టి సహాయక సాంకేతికతలను సమూలంగా మార్చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. జిన్హువా వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ అధ్యయనం ప్రఖ్యాత ‘సెల్’ జర్నల్‌లో ప్రచురితమైంది.
సాధారణంగా మన కళ్లు 400 నుంచి 700 నానోమీటర్ల తరంగదైర్ఘ్యం మధ్య ఉన్న కాంతిని మాత్రమే చూడగలవు. దీంతో ప్రకృతిలోని ఎంతో సమాచారం మనకు అందకుండా పోతుంది. అయితే, 700 నుంచి 2,500 నానోమీటర్ల తరంగదైర్ఘ్యం కలిగిన సమీప పరారుణ కాంతి, జీవ కణజాలాల్లోకి ఎలాంటి రేడియేషన్ నష్టం లేకుండా చొచ్చుకుపోగలదు. ఈ లక్షణాన్ని ఉపయోగించుకుని, అదృశ్య పరారుణ కాంతిని దృశ్య రూపంలోకి మార్చే పారదర్శకమైన, ధరించగలిగే లెన్స్‌లను శాస్త్రవేత్తలు రూపొందించారు.

Contact Lenses: లెన్స్‌లపై శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ!

అరుదైన మృత్తిక మూలకాలతో..
ఈ పరిశోధనలో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనా, ఫుడాన్ యూనివర్సిటీ (చైనా), యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ స్కూల్ (అమెరికా) శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. వీరు అరుదైన మృత్తిక మూలకాలను (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) ప్రత్యేకంగా మార్పులు చేసి, మూడు వేర్వేరు పరారుణ తరంగదైర్ఘ్యాలను ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో కనిపించేలా చేశారు. గతంలో జంతువుల రెటీనాలోకి ఓ నానోపదార్థాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా అవి పరారుణ కాంతిని చూడగలిగేలా ఇదే బృందంలోని కొందరు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. అయితే, మనుషులకు రెటీనా ఇంజెక్షన్లు ఆచరణ సాధ్యం కాకపోవడంతో, ధరించగలిగే, హానిరహితమైన ప్రత్యామ్నాయంగా ఈ కాంటాక్ట్ లెన్స్‌లను రూపొందించడంపై దృష్టి సారించారు.
పారదర్శకమైన కాంటాక్ట్ లెన్స్‌ల తయారు
ఈ అరుదైన మృత్తిక నానో కణాల ఉపరితలాన్ని మార్పు చేసి, వాటిని పాలిమర్ ద్రావణాలలో కలిపి, అత్యంత పారదర్శకమైన కాంటాక్ట్ లెన్స్‌లను తయారు చేసినట్లు అధ్యయనంలో వివరించారు. ఈ లెన్స్‌లను ధరించిన వాలంటీర్లు పరారుణ కాంతితో కూడిన నమూనాలను, సంకేతాలను గుర్తించగలిగారని, అంతేకాకుండా పరారుణ కాంతిలోని మూడు విభిన్న “రంగులను” కూడా వేరు చేసి చూడగలిగారని తెలిపారు. ఇది మానవ సహజ దృష్టి పరిమితులను దాటి చూడగలిగే సామర్థ్యాన్ని అందిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
సాంకేతికత ప్రాథమిక ప్రయోగ దశ
ఈ నాన్-ఇన్వాసివ్ (శరీరంలోకి చొచ్చుకుపోని) టెక్నాలజీ వైద్య రంగంలో ఇమేజింగ్, సమాచార భద్రత, సహాయక చర్యలు, రంగుల అంధత్వం చికిత్స వంటి అనేక రంగాల్లో ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నైట్ విజన్ గాగుల్స్ లా కాకుండా, ఈ లెన్స్‌లకు ఎలాంటి విద్యుత్ వనరు అవసరం లేదు. పొగమంచు లేదా దుమ్ము వంటి తక్కువ దృశ్యమాన పరిస్థితులలో కూడా ఇవి మెరుగైన, మరింత సహజమైన దృష్టి అనుభవాన్ని అందిస్తాయని వారు వివరించారు. ప్రస్తుతానికి ఈ సాంకేతికత ప్రాథమిక ప్రయోగ దశ (ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్)లోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఇది దృష్టి లోపాలున్న వారికి ఎంతగానో సహాయపడుతుందని, అదృశ్య కాంతి వర్ణపటంతో మానవులు సంకర్షణ చెందే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: Pahalgam Attack: నెల రోజులు పూర్తి అయినా ఇంకా దొరకని పహల్గాం ఉగ్రవాదులు

#telugu News amazing discovery Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu on lenses! Paper Telugu News Scientists' Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.