📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Schizophrenia: ఆందోళన కలిగిస్తున్న స్కిజోఫ్రీనియా రుగ్మత

Author Icon By Anusha
Updated: May 24, 2025 • 4:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ స్కిజోఫ్రెనియా దినోత్సవం ప్రతి సంవత్సరం మే 24 న జరుపుకుంటారు,భయానికి రూపం ఉండకపోయినా, దాని ప్రభావం చాలా మందిపై తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా భ్రమలు (Delusions), హల్యూసినేషన్స్ (Hallucinations) వంటి మానసిక లక్షణాలు ఉన్నవారు ఊహల్లో జీవిస్తారు.భ్రమ ఏదైతే ఉందో అది మనలో మరింత భయాన్ని పెంచుతోంది. ధైర్యంగా మాట్లాడే వారూ కొన్ని సార్లు కొందరూ చెప్పిన మాటలకు వణుకుతారు. మరికొన్నిసార్లు ఎవరూ లేకున్నా ఎవరో ఉన్నారనే అనుమానం, ఎవరో కనిపిస్తున్నారని, వారూ నన్ను చంపేస్తారని కొందరూ మానసిక వేదనకు గురవుతారు. ఇవన్నీ అపోహలు అనీ అనుకుంటాము. కానీ ఇది ఒక వ్యాధికి సంబంధించిన లక్షణాలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏటా ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని నిపుణులంటున్నారు. ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలను వారు వెల్లడించారు.నూజివీడుకు చెందిన 25 ఏళ్ల యువతి ప్రవర్తనలో ఇటీవల మార్పులు వచ్చాయి. తనతో ఎవరో మాట్లాడుతున్నారని, తనకు ఎవరో కనిపిస్తున్నారని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని భయపడుతోంది. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు మానసిక వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లడంతో, వారు ఆ అమ్మాయి స్కిజోఫ్రీనియా వ్యాధి(Schizophrenia disease)తో బాధపడుతున్నట్లు గుర్తించారు. డాక్టర్లు చికిత్స అందించడంతో ఆమె మానసిక స్థితి మెరుగుపడింది.

కారణాలు

మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నపుడే దేన్నయినా సాధించగలుగుతాడు. ఆరోగ్యమంటే కేవలం శారీరిక ఆరోగ్యమే కాదు. మానసిక ఆరోగ్యం కూడా. మానవ వికాసానికి ఆరోగ్యం మరెంతో కీలకం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏటా ఎంతో మంది స్కిజోఫ్రీనియా వ్యాధితో బాధపడుతున్నారు.స్కిజోఫ్రీనియా అనేది తీవ్రమైన మానసిక రుగ్మత. అది మెదడు పనితీరుకు అంతరాయం కలిగిస్తూ ఆలోచనలు, జ్ఞాపక శక్తి, ప్రవర్తనలో జోక్యం చేసుకుంటుంది. దానివల్ల రోజువారీ జీవితం కష్టంగా మారుతుంది. ఇది ప్రాణాంతకం కాదు. కానీ ప్రమాదకరమైన ప్రవర్తనకు దారి తీయవచ్చు. మూడింట ఒక వంతు మందిలో లక్షణాలు కాలక్రమేణా తీవ్రం అవుతాయి. పది శాతం మంది ఆత్మహత్య చేసుకుంటారు. అందువల్ల సక్రమంగా చికిత్స చేయిస్తూ, జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి.పుట్టుకకు ముందు మెదడు అభివృద్ధి సమస్యలు,మెదడులోని వివిధ ప్రాంతాల మధ్య కనెక్షన్లు నష్టపోవడం,సెల్‌-టు-సెల్‌ కమ్యూనికేషన్‌ కోసం మెదడు ఉపయోగించే రసాయన సంకేతాలలో అసమతుల్యత.

Schizophrenia: ఆందోళన కలిగిస్తున్న స్కిజోఫ్రీనియా రుగ్మత

లక్షణాలు 

అసంబద్ధంగా మాట్లాడటం,ఆలోచనల్లో గందగోళం వల్ల మాటల్లో స్పష్టత లేకపోవడం,ఎవరికీ కనిపించని స్వరాలను వినడం, ఎవరూ చూడలేని వాటిని చూడటం,పరిశుభ్రతను పట్టించుకోకపోవడం, అనుమానించడం, భయపడటం, నిరాశ, ఆందోళన, ఆత్మహత్య ఆలోచనలు ఇవన్నీ లక్షణాలు.ఈ లక్షణాలతో చేతబడి చేశారని, దయ్యం పట్టిందని, చెడు గాలి సోకిందని మొదలైనవి అన్నీ ఊహాగానాలు మాత్రమే . దీనికి వైద్యం లేదని, వీరికి పుట్టే పిల్లలు కచ్చితంగా ఇదే వ్యాధితో పుడతారనేది అపోహ. వ్యాధి తొలి దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే కోలుకునే అవకాశం ఉంది.

Read Also : Road Accident : క‌డ‌ప జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం … ఐదుగురు మృతి

#DelusionDisorder #MentalHealthAwareness #WestGodavari Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Today News In Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.