ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ ఉదయం ప్రత్యేక విమానంలో సౌదీకి బయలుదేరారు. రెండు రోజుల పాటు అక్కడ పర్యటిస్తారు. ఆ దేశ ప్రధానమంత్రి క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన చేపట్టారు. ఇంకాస్సేపట్లో జెడ్డాకు చేరుకుంటారు.
సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్వహించబోయే వివిధ సమావేశాలు పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు మోదీ. ఆ దేశంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న దౌత్య, వాణిజ్య,ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేలా పలు ఒప్పందాలపై ఇరు దేశాల అత్యున్నత అధికారులు సంతకాలు చేయనున్నారు.
మోదీ ఎక్స్ హ్యాండిల్‌లో ఓ ట్వీట్ పోస్ట్
దశాబ్ద కాలంలో ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే తన పర్యటన ముఖ్య ఉద్దేశమని మోదీ తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. సౌదీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపర్చుకునేలా నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ఇండియన్ డయాస్పొరాను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కార్మికుల కోసం ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల గురించి వివరిస్తారు. భారత్‌లో పెట్టుబడులకు గల అవకాశాల గురించి వివరిస్తారు. ప్రధాని మోదీ పర్యటనపై సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ వాణిజ్యవేత్త, సీనియర్ కన్సల్టెంట్ ఇంజినీర్ హని కయాల్ మాట్లాడారు. ఇప్పటికే నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఫార్మాసూటికల్స్ వంటి అనేక రంగాల్లో భారత్‌తో కలిసి పని చేస్తోన్నామని కయాల్ వివరించారు. కాగా- ఈ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అరుదైన గౌరవం లభించింది. ఆయన ప్రయాణిస్తోన్న ఎయిరిండియా 1.. సౌదీ గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే- ఆ దేశ వైమానిక దళానికి చెందిన ఎఫ్ 15 ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్‌గా నిలిచాయి. ఆరు జెట్ ఫైటర్స్ ఎస్కార్ట్ అయ్యాయి. మోదీ విమానానికి రెండు వైపులా మూడు చొప్పున ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి.
Read Also: Trump : అమెరికాను దెబ్బతీస్తే సహించను