📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Operation Sindoor: పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడి శాటిలైట్ ఫోటోలు విడుదల

Author Icon By Vanipushpa
Updated: May 12, 2025 • 5:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)లో భాగంగా పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (Kashmir) లోని ఉగ్రవాద శిబిరాలపై దాడుల అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలను భారత సైన్యం (Indian Army) విడుదల చేసింది. దాడిచేసిన ప్రాంతాల్లో విధ్వంసానికి ముందు.. ఆ తర్వాత ఉపగ్రహాలు తీసిన పోటోలతో పోల్చిచూపింది. మురీద్‌కే, బహావల్‌పూర్ వంటి ప్రముఖ లక్ష్యాలకు సంబంధించిన ఫోటోలు, అలాగే పాకిస్థాన్ వైమానిక దళ రాడార్‌లు, స్థావరాలపై భారత్ చేసిన దాడులకు సంబంధించిన చిత్రాలూ ఇందులో ఉన్నాయి. ఏప్రిల్ 22 న పహల్గామ్‌ (Pahalgam) ఉగ్రదాడికి ప్రతీకారంగా.. మే 7న తెల్లవారుజామున భారత సైన్యం పాకిస్థాన్ భూభాగం, పీఓకేలోకి ప్రవేశించి… ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, శిబిరాలపై మిస్సైల్ దాడులు చేసింది.

Operation Sindoor: పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడి శాటిలైట్ ఫోటోలు విడుదల

మొత్తం 9 చోట్ల 24 క్షిపణి దాడులు
ఈ దాడుల్లో లష్కరే తొయిబా (LeT), జైషే-మహమ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల ప్రధాన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. మొత్తం 9 చోట్ల 24 క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు భారత సైన్యం ప్రకటించింది. వీరిలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాకుడు మౌలానా మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులు సహా ఐదుగురు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌లు ఉన్నారు.

మురీద‌కే (Muridke)
పాకిస్థాన్ వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందిన మురీద్‌లకే లష్కరే తొయిబా ( LeT) ప్రధాన కార్యాలయం ఉంది. దాదాపు 200 ఎకరాల స్థలంలో వ్యాపించే ఈ కేంద్రంలో ఉగ్రవాద శిక్షణ శిబిరం, ఇతర మౌలిక వసతులు ఉన్నాయి. ఆపరేషన్ (Operation Sindoor)కు ముందు, తరువాత ఫోటోలు ఈ కేంద్రం పై దాడి వివరాలను స్పష్టంగా చూపిస్తాయి.

బహావల్‌పూర్ (Bahawalpur)
పంజాబ్‌లోని భవల్‌పూర్ జైషే మహమ్మద్ (JeM)కు ముఖ్య కేంద్రంగా ఉంది. పాకిస్థాన్‌ పంజాబ్ రాష్ట్రంలోని బహావల్పూర్ నగర శివార్లలో నేషనల్ హైవే-5 (కరాచీ-టోర్కామ్ హైవే)పై, కరాచీ మోర్ వద్ద ఉంది. ఇది జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ప్రధాన శిక్షణా, యువతలో తీవ్రవాద భావజాలం నాటే కేంద్రంగా విస్తరించింది. ఇది సుమారు 15 ఎకరాల్లో ఉంటుంది. ఈ మార్కజ్ జైష్ ఆపరేషనల్ ప్రధాన కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు.. ఫిబ్రవరి 14, 2019న జరిగిన పుల్వామా ఆత్మాహుతి దాడిని అమలు చేసిన ఉగ్రవాదులు ఈ శిబిరంలోనే శిక్షణ పొందినట్టు తెలిసింది.
పాకిస్తాన్ వాయుసేన రాడార్‌లు, వైమానిక స్థావరాలు
భారత్‌ వైమానిక స్థావరాలు, సైనిక పోస్ట్‌లు, పౌరులే లక్ష్యంగా పాకిస్థాన్ డ్రోన్లు, మిస్సైళ్ల దాడులకు దిగడంతో ఇండియన్ ఆర్మీ తీవ్రంగా స్పందించింది.
పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్, ఆయుధ డిపోలు (రఫ్లీ, చక్లాల, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్, సియాల్‌కోట్ మొదలైనవి)పై దాడులు చేసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మే 9–10 మధ్య చేసిన దాడిలో అణుస్థావరానికి సమీపంలోని పాక్ వైమానిక స్థావరం కూడా ధ్వంసమైందని సైన్యాధికారులు పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌కు చెందిన కొన్ని అత్యాధునిక విమాన వ్యవస్థలను కూల్చేశామని భారత వైమానికదళ ఎయిర్‌ మార్షల్ ఏకే భారతీ వెల్లడించారు. భారత స్థావరాలపై దాడి చేసేందుకు పాక్ చేసిన ప్రయత్నాలను గగనతల రక్షణ వ్యవస్థలు సమర్ధవంతంగా అడ్డుకున్నాయని అన్నారు.

Read Also: India-pak : భారత్-పాకిస్తాన్ చర్చలు చివరి నిమిషంలో వాయిదా

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu of strikes on terror camp Pakistan released Paper Telugu News Satellite images Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.