📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Sanjay Manjrekar: సీనియర్ ఆటగాళ్లకు సంజయ్ మంజ్రేకర్ వార్నింగ్

Author Icon By Anusha
Updated: June 30, 2025 • 4:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగనున్న రెండో టెస్టు మ్యాచ్‌ జూలై 2 బుధవారం నుండి ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ప్రారంభం కానుంది. తొలి టెస్టులో భారత్ జట్టు 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైన నేపథ్యంలో, రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలన్న నిబద్ధతతో ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ ఈ పరిస్థితుల మధ్య టీమ్‌ఇండియాకు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) ఒక కీలక హెచ్చరిక చేశారు.సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ “రిషబ్ పంత్ తన సూపర్ ఫామ్‌ను తదుపరి టెస్టులోనూ కొనసాగిస్తాడని నేను అనుకుంటున్నాను. అలాగే కేఎల్ రాహుల్ కూడా రాణిస్తాడని అనుకుంటున్నాను. రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ ఆడటాన్ని ఆనందంగా చేస్తాడు. ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేయడం సాధారణ విషయం కాదు. ఒక బ్యాటర్ మానసికంగా చాలా బలంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.

మరో సీనియర్ ఆటగాడు కూడా తన ఫామ్‌ను

రిషబ్ పంత్ 48 గంటల వ్యవధిలో దీన్ని సాధించాడంటే అతను గొప్ప ఆటగాడు.అంతే కాకుండా ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ క్రికెట్ ఆడటాన్ని రిషబ్ పంత్ (Rishabh Pant) ఆనందంగా స్వీకరిస్తున్నాడు.గత కొన్ని నెలలుగా రిషబ్ పంత్ సరిగా ఆడలేదు. దీని వల్ల పంత్‌కు పరుగుల దాహం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ సిరీస్ మొత్తం పంత్ తన ఫామ్‌ను కొనసాగిస్తాడని నేను ఆశిస్తున్నాను. అదే విధంగా జట్టులోని మరో సీనియర్ ఆటగాడు కూడా తన ఫామ్‌ను సిరీస్ మొత్తం కొనసాగించాలి” అని సంజయ్ మంజ్రేకర్ సూచించారు.అలాగే కేఎల్ రాహుల్ బాగా రాణిస్తాడని వివరించాడు. సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ “భారత క్రికెట్‌కు ఇప్పుడు కేఎల్ రాహుల్ చాలా ముఖ్యమైన ఆటగాడిగా మారిపోయాడు. కేఎల్ రాహుల్ (KL Rahul) కేవలం ఒక టెస్టులో మాత్రమే బాగా ఆడే ఆటగాడిగానో, లేదా ఒక సెంచరీ కొడితే చాలు అనుకునే ఆటగాడిగానో ఉండకూడదు.

Sanjay Manjrekar:

రెండో టెస్ట్ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని

ఈ సిరీస్ మొత్తం కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాలి” అని సంజయ్ మంజ్రేకర్ తెలిపారు.ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జులై 2 నుంచి జరగనుంది. వర్క్‌లోడ్ నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) రెండో మ్యాచ్‌లో అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ఇంగ్లండ్ జట్టులో స్థానం సంపాదించుకున్న జోఫ్రా ఆర్చర్ రెండో టెస్ట్ మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్‌లోకి మళ్లీ వచ్చే అవకాశం ఉంది.

Read Also: Greg Chappell: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో భారత్ ఓటమిపై స్పందించిన గ్రెగ్ చాపెల్

Ap News in Telugu Breaking News in Telugu Edgbaston test match Google news Google News in Telugu India England test highlights India senior players cricket India vs England 2nd test 2025 Indian cricket team practice Latest News in Telugu Paper Telugu News Sanjay Manjrekar comments Sanjay Manjrekar warning Team India Performance Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news WTC 2025 updates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.