ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జూన్ 20న ప్రారంభమైన తొలి టెస్టు భారత క్రికెట్ అభిమానులకు ఎన్నో కొత్త ఆశలు కలిగించింది. ముఖ్యంగా టీమిండియాకు కొత్తగా జట్టులోకి వచ్చిన యువ బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudarshan) టెస్టు అరంగేట్రం చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే వన్డేలు, టీ20లతో అభిమానుల మనసులను గెలుచుకున్న సుదర్శన్ ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.శుక్రవారం లీడ్స్‌లోని హెడ్డింగ్లీ మైదానంలో ప్రారంభమైన మ్యాచ్‌కి ముందు భారత క్రికెట్‌లో ఓ గొప్ప ఘట్టం జరిగింది. టెస్ట్ క్రికెట్‌లో భారత స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన చతేశ్వర్ పుజారా చేతుల మీదుగా సాయి సుదర్శన్ టెస్ట్ క్యాప్‌ను అందుకున్నారు.
టెస్ట్ అరంగేట్రం
కేవలం 23 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనతను అందుకోవడం సాయి ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. అతని కృషికి, నిరంతర సాధనకు ఇది పెద్ద గుర్తింపు.సుదర్శన్ టెస్ట్ అరంగేట్రం కావడం ఒక్కటే కాకుండా ఒక అరుదైన రికార్డు కూడా ఆయన పేరిట నమోదైంది. జూన్ 20న టెస్ట్ అరంగేట్రం చేసిన ఆరో భారత ఆటగాడిగా (sixth Indian player) నిలిచాడు. ఈ జాబితాలో భారత క్రికెట్‌కి నిలువెత్తు ప్రతీకలుగా నిలిచిన రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లు కూడా ఉన్నారు.
వెస్టిండీస్‌తో మ్యాచ్
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో సాయి సుదర్శన్‌కు ఈ అవకాశం దక్కింది.వీరందరి సరసన సుదర్శన్ నిలవడం చాలా గొప్ప విషయంగా భావించబడుతోంది.14 ఏళ్ల క్రితం 2011లో ఇదే రోజు(జూన్ 20) విరాట్ కోహ్లీ, అభినవ్ ముకుంద్, ప్రవీణ్ కుమార్‌లు వెస్టిండీస్‌తో మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్ (Test cricket) లోకి ఎంట్రీ ఇచ్చారు. 1996లో ఇదే జూన్ 20న ఇంగ్లండ్‌పై సౌరవ్ గంగూలీతో పాటు రాహుల్ ద్రవిడ్‌లు టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. తాజాగా ఇదే రోజున సాయి సుదర్శన్ అరంగేట్రం చేయడంతో వారిలా ఈ తమిళ కుర్రాడు చరిత్ర సృష్టిస్తాడా? అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

టాస్ గెలిస్తే
ఇక సాయి సుదర్శన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని టాస్ సందర్భంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు. తాను నాలుగో స్థానంలో ఆడుతానని చెప్పిన గిల్ 8 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ (Karun Nair) ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని తెలిపాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ‘మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. ఈ వికెట్‌పై తొలి సెషన్ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.కానీ ఆ తర్వాత ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది.
అద్భుతంగా
సూర్యుడు కూడా వచ్చాడు. కాబట్టి వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్ కోసం మేం అద్భుతంగా సన్నదమయ్యాం. బెకెన్‌హమ్ (Beckenham) లో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడాం. మా కుర్రాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. సాయి సదుర్శన్ అరంగేట్రం చేస్తుండగా కరుణ్ నాయర్ రీఎంట్రీ ఇచ్చాడు. సాయి మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు.’అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. అందరూ ఊహించనట్లుగానే తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కలేదు.అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం దక్కింది.
Read Also: ENG vs IND: టాస్ ఓడిన గిల్.. తొలి టెస్ట్‌లో భారత్ ఫస్ట్ బ్యాటింగ్