📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

Sai Sudarshan: నా ఫేవరేట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ: సాయి

Author Icon By Anusha
Updated: June 8, 2025 • 11:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన సాయి సుదర్శన్.. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. నిలకడైన ప్రదర్శనతో టీమిండియా టెస్ట్ టీమ్‌లో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్‌ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాడు. ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌తో సాయి సుదర్శన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఈ సిరీస్‌ నేపథ్యంలో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి సుదర్శన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.’నా చిన్నప్పుడు వాషింగ్టన్ సుందర్‌ను అభిమానించేవాడిని. తమిళనాడు ప్లేయర్‌గా ఆ సమయంలో అతనే నాకు తెలిసిన పెద్ద ప్లేయర్. లాక్‌డౌన్ సమయంలో నేను విరాట్ కోహ్లీ బ్యాటింగ్, ఇంటర్వ్యూలు బాగా చూసాను. భారత్‌కు ఆడుతున్నప్పటి నుంచి జస్టిన్ లాంగర్, మైక్ హస్సీ‌ల బ్యాటింగ్ వీడియోలు చూసి నేర్చుకుంటున్నాను. కానీ మా నాన్న భరద్వాజే నాకు హీరో. ఆయన ఇంటర్నేషనల్ స్ప్రింటర్. ఆయన నుంచే కెరీర్‌లో సక్సెస్ సాధించాలనే కసిని నేర్చుకున్నాను.

ప్రత్యేకమైన క్షణం

నా ఫేవరేట్ విరాట్ కోహ్లీని ఐపీఎల్ 2025 ఫైనల్ తర్వాత కలిసాను. అభినందనలు తెలిపాను. అది ఆయనకు ప్రత్యేకమైన క్షణం. దాంతో ఎక్కువగా మాట్లాడలేకపోయాను. కానీ అంతకుముందు చాలా సార్లు కోహ్లీ(Virat Kohli)తో మాట్లాడాను. ఆయనలో నాకు నచ్చేది మైండ్‌సెట్. ఆటపై ఆయనకు ఉన్న మక్కువ. పరుగులు చేయనప్పుడు ఫామ్‌లో లేనప్పుడు క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఫేస్ చేస్తారని అడిగి తెలుసుకున్నాను. ప్రతీ క్రికెటర్‌ ఇలాంటి దశను ఎదుర్కొంటాడు. కాబట్టి నేను ఆ విషయాల గురించి మాట్లాడాను.

Sai Sudarshan

అద్భుతమైన విజయాల్లో

నేను ఎలాంటి సవాల్‌ను అయినా స్వీకరించేందుకు సిద్దమవుతున్నాను. కోహ్లీ, రోహిత్(Kohli, Rohit) స్థానాలను భర్తీ చేయడం అంత సులువైన పనికాదు. కానీ నేను అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకుంటున్నాను. అద్భుతమైన విజయాల్లో భాగమై నా దేశానికి మధుర జ్ఞాపకాలు మిగల్చాలని భావిస్తున్నా.’అని సాయి సుదర్శన్ చెప్పుకొచ్చాడు.

Read Also: French Open 2025: ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను గెలుచుకున్న కోకో గాఫ్‌

# my favouriate #KohliInspiration #OrangeCapWinner #Sai Sudarshan Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.