📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Sachin Tendulkar: ఇంగ్లండ్-భారత్ టెస్ట్ సిరీస్ పేరు మార్పుపై సచిన్ విజ్ఞప్తి

Author Icon By Anusha
Updated: June 16, 2025 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ చరిత్రలో విశిష్ట స్థానం ఉన్న పటౌడీ ట్రోఫీ గురించి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇంగ్లండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ జూన్ 20న లీడ్స్‌లో జరగనుంది. అయితే అంతకు ముందు ట్రోఫీ పేరు మార్పుకు సంబంధించి వివాదం ఇంకా సర్దుమణగడం లేదు. ఈసీబీ(ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు), బీసీసీఐ ట్రోఫీ పేరును పటౌడీ ట్రోఫీ నుంచి ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీగా మార్చనున్నట్లు ప్రకటించాయి. అయితే దీనిని చాలా మంది వ్యతిరేకించారు. సునీల్ గవాస్కర్ కూడా దీనికి వ్యతిరేకంగా గళం విప్పిన వారిలో ఉన్నారు.

అధికారులతో

ఇప్పుడు స్వయంగా సచిన్ టెండూల్కర్ ఈ విషయమై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారులతో మాట్లాడారు.సచిన్ టెండూల్కర్ బీసీసీఐ, ఈసీబీ అధికారులతో మాట్లాడి పటౌడీ వారసత్వం ఈ సిరీస్‌తో ముడిపడి ఉండేలా చూసుకోవాలని అభ్యర్థించారు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం,సచిన్ టెండూల్కర్ ఈ అప్పీల్ చేయగా,ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా దీనిని సీరియస్‌గా తీసుకుంది. ఐసీసీ ఛైర్‌పర్సన్ జై షా (ICC Chairperson Jay Shah) స్వయంగా ఈ విషయమై ఈసీబీ అధికారులతో మాట్లాడారు. ఇండియా-ఇంగ్లండ్ సిరీస్‌లో పటౌడీ వారసత్వంతో ఎటువంటి రాజీ పడకుండా చూసుకోవాలని ఆయన కోరారు.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌ను దక్షిణాఫ్రికా గెలుచుకుంది. లార్డ్స్‌లో జరిగిన ఈ టైటిల్ పోరులో ఆస్ట్రేలియా ఓడిపోయింది.

Sachin Tendulkar

ఎలాంటి ప్రకటన

ఈ ఫైనల్ తర్వాత ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ పేరు మార్చే వేడుక జరగాల్సి ఉండగా అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం కారణంగా దానిని వాయిదా వేశారు. భారత్‌లో జరిగిన విమాన ప్రమాదం కారణంగా ప్రస్తుతం దీనిపై ఎలాంటి ప్రకటన చేయడం లేదని ఈసీబీ తెలిపింది.భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్ పేరును 2007లో పటౌడీ ట్రోఫీగా మార్చారు. భారత క్రికెట్‌కు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పటౌడీ రాజకుటుంబానికి గౌరవార్థం ఎంసీసీ(మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్) ఈ నిర్ణయం తీసుకుంది. ఇఫ్తిఖార్ అలీ ఖాన్ పటౌడీ (Iftikhar Ali Khan Pataudi)భారత్, ఇంగ్లండ్ రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రికెటర్. అతని కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కూడా భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నారు. ఈ ఏడాది నుంచి ఈసీబీ ఈ సిరీస్ పేరును ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీగా మార్చాలని కోరుకుంది. ఈ సమాచారం పటౌడీ కుటుంబానికి కూడా తెలియజేయబడింది. అయితే వారు కూడా ఈ నిర్ణయంతో సంతృప్తి చెందలేదని తెలిసింది.

Read Also: Hilang Yagik: బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన హిలాంగ్ యాజిక్

#BCCI #INDvENG #PataudiTrophy #SachinTendulkar Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.