📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Russia: రష్యా తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్ నివేదిక

Author Icon By Anusha
Updated: June 1, 2025 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బ్రిటన్ ప్రభుత్వం విడుదల చేసిన రక్షణ,భద్రతా విశ్లేషణ నివేదికలో రష్యా, చైనా దేశాల గురించి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నివేదిక ప్రకారం, రష్యా ప్రపంచానికి తక్షణ ప్రమాదంగా పేర్కొంది.ముఖ్యంగా ఐరోపా ఖండానికి ఇది ప్రధాన ముప్పుగా మారిందని పేర్కొంది.చైనాతో దీర్ఘకాలిక, సాంకేతికపరమైన సవాల్‌ తప్పదని అభిప్రాయపడింది. ఈ నివేదిక యునైటెడ్ కింగ్‌డమ్ భౌగోళిక రాజకీయ దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తుంది. రష్యా ప్రస్తుతం ఐరోపా స్థిరత్వానికి ప్రధాన ముప్పుగా వ్యవహరిస్తోందని తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోందని, కాల్పుల విరమణకు విముఖత ఐరోపాలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయని రిపోర్ట్ స్పష్టం చేసింది. బ్రిటన్‌, NATO సభ్య దేశాలకు నేరుగా, సైనిక లేదా సైబర్ ముప్పు ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.

బ్రిటన్ నివేదిక

చైనా తన ఆర్థిక, సైనిక, సాంకేతిక సామర్థ్యాలను వ్యూహాత్మకంగా ఉపయోగిస్తూ, అంతర్జాతీయ వ్యవస్థను తిరగరాస్తుందన్న అభిప్రాయాన్ని నివేదిక వ్యక్తం చేసింది. *చైనా నిరంతరం పర్యవేక్షణకు, గూఢచర్యానికి, అంతర్గత చొరబాట్లకు పాల్పడుతున్న దేశం. ఇది ఖచ్చితంగా శాంతికి విఘాతమని స్పష్టమవుతోంది’ అని రిపోర్ట్ వ్యాఖ్యానించింది.5జీ, ఏఐ, డేటా పరిరక్షణ రంగాల్లో పరిశోధనలతో ఆధిపత్యం సాధించే ప్రయత్నాల్లో చైనా ఉందని పేర్కొంది.బ్రిటన్ తన రక్షణ వ్యయాన్ని పెంపు, సైబర్ భద్రతా నిర్మాణం బలోపేతం, ఉత్తర అట్లాంటిక్ కూటమి (NATO) భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయడంపై యూకే దృష్టిపెట్టింది. ‘ఈశాన్య ఐరోపా నుంచి పసిఫిక్ వరకూ మేము మా భద్రతా ప్రయోజనాలను గట్టిగా నిర్ధారించుకుంటాం. మేము ఏ విధంగానూ వెనక్కి తగ్గం’ అని ఉద్ఘాటించింది. కొనసాగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం, తైవాన్ విషయంలో చైనా దూకుడు నేపథ్యంలో బ్రిటన్ నివేదిక ఈ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనించాల్సిన అంశం.

Russia: రష్యా తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్ నివేదిక

సంసిద్ధత

బ్రిటన్ అంతర్జాతీయంగా తన స్థానాన్ని, బ్రెగ్జిట్ తర్వాత పునర్నిర్మించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ నివేదిక ద్వారా బ్రిటన్(Britain) తన ప్రాధాన్య భద్రతా భయాలు, విపత్తులకు ముందు సంసిద్ధత విషయాల్లో స్పష్టమైన వ్యూహం ఏర్పరచుకుందనే స్పష్టమవుతోంది. కాగా, అమెరికా నివేదిక సైతం చైనా 50 ఏళ్ల తర్వాత ప్రపంచ రాజకీయ, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించేందుకు వ్యూహాత్మకంగా కదులుతోందని వార్షిక ముప్పు నిర్దారణ పేరుతో విడుదల చేసిన రిపోర్ట్ లో హెచ్చరించింది. ఈ నివేదికను అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం (ODNI) పార్లమెంటుకు సమర్పించింది. చైనా అమెరికా జాతీయ భద్రత(America’s national security)కు అత్యంత దీర్ఘకాలిక, సాంకేతికంగా పెను సవాలు అని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా సైనిక శక్తిని విస్తరించటం, ఆర్థిక పరమైన ఆధిపత్యం, ప్రముఖ సంస్థలను నియంత్రించాలనే ఉద్దేశం వంటివి నివేదిక ప్రస్తావించింది.

Read Also: Donald Trump : భారత్‌ పాక్‌ యుద్ధాన్ని డీల్ కుదిర్చినందుకు గర్విస్తున్నా : ట్రంప్‌

#ChinaChallenge #GlobalSecurity #RussiaThreat #UKSecurityReport Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.