📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Russia: రష్యా-యుక్రెయిన్ యుద్ధం..సరికొత్త ఆయుధాల వినియోగం

Author Icon By Vanipushpa
Updated: May 31, 2025 • 12:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రిడిన్‌స్కీ పట్టణమంతా ఘాటైన వాసన వ్యాపిస్తోంది. మేం కారులో పట్టణంలోకి ప్రవేశించిన రెండు నిమిషాల తర్వాత అది ఎక్కడ నుంచి వస్తుందో మాకు కనిపించింది. 250 కేజీల గ్లైడ్ బాంబు పట్టణంలోని పరిపాలనా భవనాన్ని చీల్చుకుంటూ వెళ్లింది. బాంబు పేలుడుకు 3 నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. బాంబు పేలిన ఒక రోజు తర్వాత మేం ఆ ప్రాంతానికి వెళ్లాం. శిథిలాల నుంచి ఇప్పటికీ పొగ వస్తోంది. పట్టణ శివార్ల నుంచి ట్యాంకులు, తుపాకీ కాల్పుల శబ్దం వినిపిస్తోంది. యుక్రేయిన్(Ukraine) సైనికులు డ్రోన్లను కూల్చి వేస్తున్నారు. యుద్ధంలో చిక్కుకున్న పొక్రాస్క్ నగరానికి ఉత్తరాన 15కిలోమీటర్ల దూరంలో రిడిన్‌స్కీ పట్టణం ఉంది. గతేడాది శీతాకాలం నుంచి రష్యా ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే రష్యన్(Russian) సైనికులు నగరంలోకి రాకుండా యుక్రేయిన్ బలగాలు ఆపగలిగాయి. దీంతో రష్యన్లు వ్యూహాన్ని మార్చారు. నగరంలోకి రావడానికి బదులు నగరాన్ని చుట్టుముట్టారు. నగరంలోకి సరఫరాలను రాకుండా అడ్డుకున్నారు.

Russia: రష్యా-యుక్రెయిన్ యుద్ధం..సరికొత్త ఆయుధాల వినియోగం

దాడుల తీవ్రతను పెంచిన రష్యా
గత రెండు వారాలుగా యుక్రెయిన్‌లో కాల్పుల విరమణ
కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు విఫలం కావడంతో రష్యా దాడుల తీవ్రతను పెంచింది. జనవరి తర్వాత మరింత పురోగతి సాధించింది. రిడిన్‌స్కీలో దీనికి సంబంధించిన ఆధారాలు కనిపించాయి. పట్టణంలోకి వచ్చిన నిమిషాల్లోనే మా మీద ఒక రష్యన్ డ్రోన్ ఎగరుతున్న శబ్దం విన్నాం. రక్షణ కోసం మా బృందం దగ్గరలో ఉన్న చెట్టు కిందకు పరుగు తీసింది. డ్రోన్ మమ్మల్ని చూడకుండా ఉండేందుకు మేము దానికి వ్యతిరేక దిశలో దాక్కున్నాం. తర్వాత పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. మరో డ్రోన్ అక్కడ తన ప్రభావం చూపిస్తోంది. మాపైన ఉన్న డ్రోన్ ఇంకా ఎగురుతూనే ఉంది.
కొన్ని నిమిషాల పాటు ఈ యుద్ధంలో ప్రమాదకరంగా మారిన ఆ ఆయుధపు భయంకరమైన శబ్దాన్ని మేం వింటూనే ఉన్నాం. అది మాకు వినిపించడం ఆగిపోయిన తర్వాత అక్కడకు 100 అడుగుల దూరంలో ఉన్న ఒక పాత భవనంలోకి పరుగు తీశాం. లోపలకు వెళ్లిన తర్వాత మాకు డ్రోన్ శబ్దం మళ్లీ వినిపించసాగింది. మా కదలికలను గమనిస్తే అది తిరిగి వచ్చే అవకాశం ఉంది.
రిడిన్‌స్కీను రష్యన్ డ్రోన్లు చుట్టుముట్టడం పొక్రాస్క్‌కు దక్షిణాన తమ స్థావరాల నుంచి రష్యన్లు మరింత దగ్గరగా వచ్చారని చెప్పడానికి నిదర్శనంగా భావించవచ్చు.
ఆ డ్రోన్లు బహుశా, పొక్రాస్క్ తూర్పు నుంచి కోస్టియాన్టినివ్‌కా వెళ్లే కీలకమైన రహదారి మీద రష్యన్లు కొత్తగా ఆక్రమించుకున్న ప్రాంతం నుంచి వచ్చి ఉండవచ్చు. మేం అరగంట సేపు ఆ శిథిల భవనంలో వేచి చూశాక డ్రోన్ శబ్దం ఆగిపోయింది. దీంతో మేం చెట్టుకింద పార్క్ చేసిన కారు వద్దకు పరుగు తీశాం. రిడిన్‌స్కీ నుంచి త్వరగా వెళ్లిపోయాం.
మోర్టార్లు, డ్రోన్లు వినియోగం
ఆమె శిథిలమైన తన ఇంట్లో నుంచి తనకు సంబంధించిన కొన్ని వస్తువులను తెచ్చుకున్నారు. దాడి జరిగిన సమయంలో అదృష్టత్తువశాత్తూ స్విత్లానా అక్కడ లేరు. “పట్టణం మధ్యలోకి వెళ్లండి. అక్కడ మీరు చాలా విధ్వంసాన్ని చూడవచ్చు. బేకరీ, జూ కూడా ధ్వంసం అయ్యాయి” అన్నారు. డ్రోన్లు చేరుకోలేని ఒక సురక్షిత ప్రాంతంలో మేం ఐదో అస్సాల్ట్ బ్రిగేడ్‌ ఫిరంగి దళానికి చెందిన సైనికులను కలిశాం. “రష్యన్ దాడుల తీవ్రత పెరగడాన్నిగమనించవచ్చు. నగరంలోకి సరఫరాలు రాకుండా అడ్డుకునేందుకు వారు మోర్టార్లు, డ్రోన్లు.. ఒకటేమిటి, అన్నింటినీ వాడుతున్నారు” అని సెర్హీ చెప్పారు.
ఫైబర్ కేబుల్ ద్వారా ప్రసారం
“డ్రోన్ ఎగిరినప్పుడు అది చూపించే వీడియో, కంట్రోల్ సిగ్నల్స్ రేడియో తరంగాల నుంచి కాకుండా ఫైబర్ కేబుల్ ద్వారా ప్రసారమవుతాయి. దీనర్ధం ఈ ఫైబర్ డ్రోన్లను ఎలక్ట్రానిక్ ఇంటర్‌సెప్టర్ల ద్వారా జామ్ చేయడానికి వీలుపడదు” అని 68వ జేగర్ బ్రిగేడ్‌లోని ఓ సైనికుడు చెప్పారు. ఈ యుద్ధంలో డ్రోన్లను భారీ స్థాయిలో వినియోగిస్తుండటంతో రెండు సైన్యాలు తమ వాహనాలకు ఎలక్ట్రానికి వార్‌ఫేర్ సిస్టమ్స్‌ను అమర్చుకున్నాయి. వీటి ద్వారా డ్రోన్లను కూల్చివేయవచ్చు. ఆఫ్టిక్ ఫైబర్ డ్రోన్లు రావడంతో ఈ భద్రతా వ్యవస్థ వల్ల కూడా ప్రయోజనం లేకుండా పోయింది.

Read Also: Trump: తలుపులు వేసుకోవాలంటూ మెక్రాన్ దంపతులకు ట్రంప్ సూచన

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Russia-Ukraine War Telugu News online Telugu News Paper Telugu News Today use of the latest weapons

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.