📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగుతుంది: పుతిన్

Author Icon By Vanipushpa
Updated: July 5, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉక్రెయిన్‌ పై రష్యా తన దాడిని ఇప్పట్లో అపేలా లేదు. అదే విషయాన్ని పుతిన్‌(Putin) స్పష్టం చేశారు. ఉక్రెయిన్(Ukraine) తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్(Ukraine) పై యుద్ధం ఆపేది లేదని కన్ఫామ్ చేశారు. ఉక్రెయిన్ పై జరుపుతున్న దాడులపై స్పందిస్తూ ఉక్రెయిన్ లో నో ఫ్లై జోన్ విధించే ఏ ప్రయత్నమైనా… సంఘర్షణకు తావిచ్చినట్లేనని అన్నారు. దాంతో పాటుగా లక్ష్యం నెరవేరే వరకూ యుద్ధం ఆగదని, ఎంతో ఆలోచించాకే ఉక్రెయిన్ పై దాడి మొదలుపెట్టామని స్పష్టం చేశారు.‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ అణ్వాయుధాలకు నిలయంగా ఉండదు. శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించింది. ఊహించిన దాని కంటే యుద్ధం భీకరంగా సాగింది’ అని తెలిపారు.

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై యుద్దం కొనసాగుతుంది: పుతిన్

ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.ఈ విషయమై ట్రంప్‌తో గంటసేపు ఫోన్‌లో మాట్లాడిన పుతిన్‌ కాల్పుల విరమణకు రష్యా సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. “ఇరువురు నాయకులు యుద్ధం గురించి చర్చించుకున్నారు. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని ట్రంప్‌ సూచించినా, పుతిన్‌ తిరస్కరించారు’’ అని క్రెమ్లిన్‌ ప్రతినిధి యూరీ ఉష్కోవ్‌ వెల్లడించారు. పుతిన్‌తో జరిగిన ఫోన్‌ సంభాషణపై ట్రంప్‌ నిరాశ వ్యక్తంచేశారు.

అతిపెద్ద వైమానిక దాడి

ప్రకటించినట్లే ఉక్రెయిన్‌లోని కీవ్‌ సహా 13 ప్రదేశాలు లక్ష్యంగా భారీగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఏకంగా 11 క్షిపణులను, 550 డ్రోన్లను ఉక్రెయిన్‌ పైకి పంపింది. అయితే వీటిలో 270 డ్రోన్లను, 2 క్షిపణులను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద వైమానిక దాడి అని ఉక్రెయిన్‌ ప్రకటించింది.ఈ దాడుల్లో 23 మంది గాయపడ్డారు. ఇక దాడిలో కీవ్‌లోని పోలండ్‌ దౌత్య కార్యాలయం దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. పలు నివాస భవనాలు సైతం ధ్వంసమైనట్లు తెలిపింది.

రసాయన ఆయుధాలను వినియోగించడం సరికాదు

ఇక ఈ యుద్ధంలో రష్యా రసాయన ఆయుధాలను ప్రయోగించినట్లు నెదర్లాండ్స్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ వెల్లడించింది. కీవ్‌ సైనికులను ఉక్కిరిబిక్కిరి చేసి చంపేందుకు మాస్కో వీటిని ఉపయోగిస్తోందని డచ్‌ రక్షణ మంత్రి రూబెన్‌ బ్రెకెల్‌మాన్స్‌ఆరోపించారు. ఈ రసాయన ఆయుధాల కారణంగా ఉక్రెయిన్‌లో ముగ్గురు మరణించారని, దాదాపు 2,500 మంది గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారుల నివేదిక తెలిపింది. రష్యా ఈ రసాయన ఆయుధాలను వినియోగించడం సరికాదని, వీటి ఉపయోగం ఇతర దేశాలకు హానికరమేనని చెప్పారు. ఇలా రసాయన ఆయుధాలను వినియోగించడం నేరమని, ఆ దేశంపై ఆంక్షలు విధించాలని డిమాండ్‌ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Fast food: దేవయానీ ఇంటర్నేషనల్, సఫైర్‌ ఫుడ్స్‌ విలీనానికి

#telugu News Ap News in Telugu Breaking News in Telugu geopolitical crisis Russia Ukraine Google News in Telugu Latest News in Telugu ongoing war Ukraine Paper Telugu News Putin Ukraine statement Russia military operations Russia troops Ukraine Russia-Ukraine War Telugu News online Telugu News Paper Telugu News Today Ukraine conflict Ukraine invasion Vladimir Putin news war in Eastern Europe

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.