📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Russia : ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధం

Author Icon By Digital
Updated: April 24, 2025 • 3:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Russia : శాంతిచర్చలకు సిద్ధమే: పుతిన్

ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇదే తొలిసారి ద్వైపాక్షిక చర్చలపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశంతో అమెరికా తీవ్ర ఒత్తిడి తెస్తున్న తరుణంలో, పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా అధికారిక వార్తా చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రష్యా శాంతికి సిద్ధమని, అదే విధంగా ఉక్రెయిన్ నుంచి కూడా ఇదే ఆశిస్తున్నామని చెప్పారు.అయితే పుతిన్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ అధికారులు తక్షణ కాల్పుల విరమణ ద్వారానే శాంతి సాధ్యమని వ్యాఖ్యానించారు. యుద్ధ పరిణామాలను ముగించాలన్న లక్ష్యంతో అమెరికా మరియు యూరోపియన్ దేశాల ప్రతినిధులతో చర్చించేందుకు ఉక్రెయిన్ ఉన్నత స్థాయి బృందం లండన్‌కు వెళ్తోందని సమాచారం. ఇది శాంతి దిశగా ఒక కీలక అడుగు కావొచ్చు.ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా శాంతి చర్చలకు మద్దతుగా పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, భూభాగాలపై మిలటరీ దాడులు మాత్రం కొనసాగుతున్నాయి. ఆదివారం రోజు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై Russia పదుల సంఖ్యలో డ్రోన్ దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. దీనికి ప్రతీకారంగా ఉక్రెయిన్ సైన్యం కూడా దాడులు కొనసాగించిందని అధికారులు తెలిపారు.ఈ పరిణామాలన్నీ చూస్తే, ఒకవైపు శాంతి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, మరోవైపు యుద్ధతీవ్రత తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇకపై ఈ చర్చలు ఎటు దారితీస్తాయో చూడాలి.

Read More : Pahalgam Terror Attack : ఉగ్రదాడి మృతులపై అధికారిక ప్రకటన

Breaking News in Telugu Google News in Telugu International Politics Latest News in Telugu Paper Telugu News Russia News Russia President Russia Ukraine War Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Ukraine peace talks Vladimir Putin

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.