📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Russia: ఉక్రెయిన్‌పై 60 క్షిపణులతో విరుచుకుపడిన రష్యా..

Author Icon By Vanipushpa
Updated: June 30, 2025 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా ఉక్రెయిన్‌(Russia-Ukraine)ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాగా శనివారం రాత్రి రష్యా అతిపెద్ద దాడి చేసింది. రష్యా 477 డ్రోన్లు, 60 క్షిపణులతో ఉక్రెయిన్‌(Ukrain)పై విరుచుకుపడింది. యుద్ధం మొదలైన నాటి నుంచి జరిగిన దాడుల్లో ఇదే అతిపెద్ద దాడి అని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వీటిల్లో 249ని కూల్చేశామని.. మరో 226 ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ వ్యవస్థల ప్రభావంతో కూలిపోయాయని ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య 2022 నుంచి దాడులు కొనసాగుతున్నాయి. 36 నెలలు గడిచినా ఆగని రష్యా, ఉక్రెయిన్‌ పోరు ఆగడం లేదు.
గత రాత్రి అతిపెద్ద దాడి
ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కమ్యూనికేషన్‌ కమాండర్‌ యూరీ ఇహ్‌నాట్‌ మాట్లాడుతూ.. గత రాత్రి అతిపెద్ద దాడి జరిగిందని వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని రష్యా ఆయుధాలను ప్రయోగించినట్లు చెప్పారు. పోలాండ్‌(Poland) గగనతల రక్షణ కోసం మిత్రదేశాల యుద్ధ విమానాలు రంగంలోకి దిగినట్లు పేర్కొన్నారు. ఖెర్సాన్‌ ప్రావిన్స్‌లో జరిగిన దాడుల్లో ఒకరు మరణించినట్లు అక్కడి గవర్నర్‌ వెల్లడించారు. ఈ దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానం కూలిపోయి.. అందులోని పైలట్‌ ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి మిలిటరీ తెలిపింది. ఇప్పటి వరకూ ఈ యుద్ధంలో మూడు ఎఫ్‌-16లను రష్యా కూల్చివేసింది.

Russia: ఉక్రెయిన్‌పై 60 క్షిపణులతో విరుచుకుపడిన రష్యా..

నేటికీ మాస్కోలో పేలుళ్లు జరుగుతున్నాయి: పుతిన్‌
రష్యాలో వేర్పాటువాదాన్ని పశ్చిమ దేశాలు ప్రోత్సహిస్తున్నాయని, ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో జోక్యం చేసుకుంటున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోపించారు. బెలారస్‌ రాజధాని మిన్స్క్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘రష్యాకు వ్యతిరేకంగా ఇస్లామిక్‌ స్టేట్‌ పనిచేస్తున్నంత కాలం ఎవరూ దానిపై దృష్టి సారించరు. మాస్కోలో పేలుళ్లు నేటికీ జరుగుతున్నాయి. మా దేశంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించి, మాపై పోరాటానికి ఉగ్రవాదాన్ని సాధనంగా ఎంచుకున్న పశ్చిమదేశాల విషయంలో కూడా ఇదే జరిగింది. నాటో విస్తరణ, ఉక్రెయిన్‌తో వివాదాన్ని పరిష్కరించడం లాంటి వాగ్దానాలు ఇచ్చి వాటిని నిలబెట్టుకోకుండా పశ్చిమ దేశాలు రష్యాను పదేపదే మోసం చేస్తున్నాయి’’ అని పుతిన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకున్న రష్యా
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో వెలుగుచూసిన అతిపెద్ద యుద్దం ఇదే. వాస్తవానికి తాజా యుద్ధానికి పునాదులు పదేళ్ల క్రితమే పడ్డాయి. 2014లో ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఉన్నపళంగా ఆక్రమించుకుంది. ఆనాటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌ పైకి రష్యా దండయాత్ర మొదలెట్టింది. తొలి రోజుల్లో రాజధాని కీవ్‌దాకా దూసుకొచ్చి భీకర దాడులు చేసిన రష్యా ఆ తర్వాత ఆక్రమణ వేగాన్ని అనూహ్యంగా తగ్గించింది. ఉక్రెయిన్‌ వైపు నుంచి ప్రతిఘటన కూడా దీనికి ఒక కారణం.

Read Also: mining accident : సుడాన్ లో కుప్పకూలిన బంగారు గని… 11 మంది మృతి

#telugu News 60 missiles launched by Russia Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Kyiv under attack Latest News in Telugu missile attack casualties Ukraine Paper Telugu News Russia airstrikes Ukraine Russia Missile Attack Russia targets Ukraine cities Russia Ukraine conflict 2025 Russia-Ukraine War Russian military aggression Telugu News online Telugu News Paper Telugu News Today Ukraine crisis update Ukraine defense systems Ukraine under missile strike Ukraine war latest news Vladimir Putin Ukraine attack war in Eastern Europe

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.