📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Ukraine Journalist Murder: ఉక్రెయిన్ జర్నలిస్టు అవయవాలను తీసి రష్యా హతమార్చింది

Author Icon By Vanipushpa
Updated: May 1, 2025 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత మూడు సంవత్సరాలక పైగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీలు చిక్కినప్పుడల్లా రెండు దేశాలు ఆయా దేశాల పౌరులు, అధికారులను పట్టుకుంటూ నిర్భందిస్తున్నాయి. ఇలాగే రష్యా.. ఉక్రెయిన్ కు చెందిన ఓ జర్నలిస్టును చెరలోకి తీసుకోగా.. ఆమె ఇటీవలే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ దేశం ఆమె మృతదేహాన్ని ఉక్రెయిన్ కు అప్పగించగా.. పోస్టుమార్టంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆమెను రష్యా ఎంత హింసించి చంపిందో తెలిసిందో. గుండుకొట్టి, షాక్ పెట్టి, మెదడు తీసేసి.. శరీరంలోని ఎముకలు అన్నీ విరిగిపోయేలా చేసి మరీ హత్య చేసినట్లు నివేదికలో వెల్లడి అయింది.

ఎముకలు విరగొట్టి, కరెంటు షాక్ ఇచ్చి..
విక్టోరియా రోష్చినా అనే ఉక్రెనియన్ జర్నలిస్ట్‌ను రష్యా ఎంత ఛిత్రవద చేసి చంపిందో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె ఎముకలు విరగొట్టి, కరెంటు షాక్ ఇచ్చి, మాదకద్రవ్యాలు ఇవ్వడంతో పాటు తనను ఆకలితో అలమటించేలా చేసి చివరికి తన తల నుండి మెదడును బయటకు తీసి అత్యంత పాశవికంగా హత్య చేశారని ఫోరెన్సిక్ పరీక్షల్లో వెల్లడైంది. ఈ మేరకు వెలువడిన నివేదిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సైన్యం నేరాలను వెలుగులోకి తెచ్చింది
అంతర్జాతీయ పత్రికల కథనాల ప్రకారం.. విక్టోరియా రోష్చినా ధైర్య సాహసాలు ప్రదర్శిస్తుందని, నిజాన్ని నిర్భయంగా చెబుతుందని ఆమెకు పేరుంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యా పాల్పడుతున్న అక్రమాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చింది విక్టోరియానే. రష్యా ఆక్రమిత భూభాగాల్లో ఆ దేశ సైన్యం నేరాలను కూడా ఈమెనే వెలుగులోకి తెచ్చింది. అలా స్వదేశంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. అదే సమయంలో రష్యా పట్ల విలన్‌గా మారిపోయింది.
అయితే జులై 25, 2023న విక్టోరియా లాట్వియా గుండా రష్యాలోకి ప్రవేశించి, ఆక్రమిత జపోర్జియా ప్రాంతంలోని మెలిటోపోల్‌కు చేరుకుంది. అప్పటి నుంచి ఆమెతో కనెక్షన్ తెగిపోయింది. ఆ తర్వాత ఆమెను డ్రోన్‌ ద్వారా గుర్తించిన రష్యా సైన్యం ఎనర్‌హోదర్‌లో అదుపులోకి తీసుకున్నారు. తర్వాత స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించి, అక్కడి నుంచి గ్యారేజీలు అని పిలిచే ప్రాంతానికి తరలించారు.
బలవంతంగా మాదక ద్రవ్యాలు
అక్కడ ఆమెను రష్యా తీవ్రంగా చిత్రవధకు గురిచేసినట్లు తెలిసింది. పదే పదే విద్యుత్ షాక్‌లు పెట్టినట్లు శవపరీక్షలో తేలింది. చేతులు, కాళ్లపై కత్తితో పొడవడం, ఆ తర్వాత ఓ జైలులో ఆమెను బంధించగా, అక్కడి ఖైదీలు ఆమెకు బలవంతంగా మాదక ద్రవ్యాలు ఇచ్చారు. అలా కొన్నిరోజుల్లోనే ఆమె పిచ్చిగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఆమెకు ఆహారం అందించకుండా ఆకలి బాధకు గురి చేశారు. శవపరీక్షలో ఆమె మెడలోని ఎముక విరిగినట్లు తేలింది. ఆమె మెదడు, కళ్లు, స్వరపేటిక కనిపించలేదు. అంటే ఆమె శరీరం నుంచి వాటిని వేరు చేశారు. అయితే ఆమె చనిపోవడానికి కచ్చితమైన కారణాన్ని మాత్రం వైద్యులు గుర్తించలేకపోయారు.

Read Also: In-Pakistan: భారత్ పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు .. చైనా దారి ఎటు?

#telugu News Ap News in Telugu Breaking News in Telugu by-removing Google News in Telugu her-organs Latest News in Telugu Paper Telugu News russia-kills- Telugu News online Telugu News Paper Telugu News Today ukrainian-journalist

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.