📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Rohit Sharma: టీ20 ప్రపంచకప్ 2024లో మమ్మల్ని హోటల్ నుంచి బయటకు రానివ్వలేదన్న రోహిత్ శర్మ

Author Icon By Anusha
Updated: June 28, 2025 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం దేశవ్యాప్తంగా సంతోషోత్సవాలకు దారి తీసింది. 11 సంవత్సరాల విరామానంతరం భారత జట్టు ఐసీసీ ట్రోఫీ (ICC Trophy) ని అందుకోవడం దేశానికి గర్వకారణంగా నిలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో జట్టు అసాధారణ ప్రదర్శనతో ప్రత్యర్థులను చిత్తుచేసింది. ఈ టోర్నమెంట్ అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా నిర్వహించగా, భారత్ తన దూకుడుతో అభిమానులను ఆకట్టుకుంది.అయితే ఈ టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లను హోటల్ నుంచి బయటకు రానివ్వలేదని రోహిత్ శర్మ తెలిపాడు. తాజాగా జియోహాట్ స్టార్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్‌ (Jio Hot Star Champions Program) లో పాల్గొన్న రోహిత్ మెగా టోర్నీకి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు హోటల్ గది నుంచి బయటకు రావద్దని మాకు చెప్పారు. 

మేం స్టేడియానికి చేరుకోగానే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు

భారత జట్టుకు ముప్పు ఉందనే హెచ్చరికలు జారీ చేశారు. మా చుట్టు భద్రతను కట్టుదిట్టం చేశారు. మా ఫుడ్‌ను మేం ఆర్డర్ చేసుకొని హోటల్ రూమ్స్‌లోనే తిన్నాం. అభిమానులు, భద్రతా సిబ్బంది, మీడియా ప్రతినిధులతో హోటల్ కిక్కిరిసిపోయింది. వారిని చూసి ఇది సాధారణ మ్యాచ్ కాదనే విషయం గ్రహించాం. ఏదో జరగబోతుందని అనిపించింది. మ్యాచ్ రోజు మేం స్టేడియానికి చేరుకోగానే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. భారత్, పాకిస్థాన్ ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తూ ఈ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అప్పటికే నేను పాకిస్థాన్‌తో చాలా మ్యాచ్‌లు ఆడాను. కానీ ఈ మ్యాచ్‌కు ముందు కనిపించిన ఉత్సాహం, అనుభూతి నాకు ఎప్పుడూ కలగలేదు.’అని రోహిత్ శర్మ (Rohit Sharma) చెప్పుకొచ్చాడు.న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. 

Rohit Sharma

బ్యాటింగ్‌తో

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్(31 బంతుల్లో 6 ఫోర్లతో 42), అక్షర్ పటేల్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాకిస్థాన్ బౌలర్లలో హ్యారీ రౌఫ్(3/21), నసీమ్ షా(3/21) మూడేసి వికెట్లు తీయగా,మహమ్మద్ అమీర్(2/23) రెండు వికెట్లు పడగొట్టాడు. షాహిన్ షా అఫ్రిది(1/29) ఓ వికెట్ తీసాడు.అనంతరం పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులే చేసి ఓటమిపాలైంది. మహమ్మద్ రిజ్వాన్ (Muhammad Rizwan) నిలకడమైన బ్యాటింగ్‌తో 73/2తో పటిష్టంగా కనిపించిన పాక్.. వరుసగా వికెట్లు కోల్పోయింది. జస్‌ప్రీత్ బుమ్రా(3/14) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. హార్దిక్ పాండ్యా(2/24) రెండు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.

Read Also: Neeraj Chopra: గ్రెనడా స్టార్ అండర్సన్ పీటర్స్‌ను అధిగమించి అగ్రస్థానం కైవసం చేసుకున్న నీరజ్‌

#IndiaWinsT20WC #rohitsharma #T20WorldCup2024 #TeamIndiaChampions Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.