📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Rishabh Pant: నేను రికార్డ్‌ల కోసం ఆడను: పంత్

Author Icon By Anusha
Updated: July 6, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో రెండో టెస్ట్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియా బ్యాటింగ్‌ చేస్తుండగా ఓ విస్మయకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ప్రధాన పాత్రధారులు టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant), ఇంగ్లండ్ వికెట్ కీపర్ జెమీ స్మిత్. రిషభ్ పంత్, ఇంగ్లండ్ వికెట్ కీపర్ జెమీ స్మిత్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఈ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్‌ చేస్తున్న రిషభ్ పంత్‌తో,వికెట్ల వెనుకాల ఉన్న జెమీ స్మిత్ (Jamie Smith) అతనితో మాట్లాడాడు.

తన ఆట తాను ఆడుతానని

దూకుడుగా ఆడుతున్న రిషభ్ పంత్‌ను 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టెస్ట్‌ల్లో ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ అందుకోవాలని సూచించాడు. అందుకు పంత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. రికార్డుపై తనకు ఆశ లేదని, తన ఆట తాను ఆడుతానని, రికార్డ్‌లు వాటంతట అవే వస్తాయని తెలిపాడు.జెమీ స్మిత్: ‘టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (Fastest Century) రికార్డ్ 55 బంతుల్లో నమోదైంది. ఈ రోజు నువ్వు ఆ రికార్డ్ అందుకోగలవు’.రిషభ్ పంత్: ‘నేను రికార్డుల కోసం ఆడను. నాకు అంత అత్యాశ కూడా లేదు. రికార్డ్స్ వచ్చేది ఉంటే అవే వస్తాయి’.64/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 427/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

భారీ స్కోర్

కెప్టెన్ శుభ్‌మన్ గిల్(162 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 161) మరోసారి భారీ శకంతో చెలరేగాడు. కేఎల్ రాహుల్(84 బంతుల్లో 10 ఫోర్లతో 55), రిషభ్ పంత్(58 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65), రవీంద్ర జడేజా(118 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 69) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(2/93), షోయబ్ బషీర్ (Shoaib Bashir),(2/119) రెండేసి వికెట్లు తీయగా, బ్రైడన్ కార్స్, జోరూట్ చెరో వికెట్ పడగొట్టారు. దాంతో ఇంగ్లండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్‌కు 180 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: BCCI : బంగ్లాదేశ్ – భారత్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ పర్యటన వాయిదా!

#2ndTest #cricketbuzz #CricketSledging #CricketViralMoment #EdgeBaston #IndianCricket #INDvsENG #JamieSmith #PantCentury #PantVsSmith #RishabhPant #StumpMic #TestCricket #ViralVideo Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.