📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan on Kashmir Issue: చర్చలకు సిద్ధంగా వున్నాం.. పాకిస్థాన్ ప్రధాని

Author Icon By Vanipushpa
Updated: May 16, 2025 • 4:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శాంతి కోసం భారత్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు పాక్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీప్‌ (Shehbaz Sharif) అన్నారు. అయితే చర్చల్లో కశ్మీర్‌ అంశాన్ని కూడా చేర్చాలని షరతు పెట్టారు. పాక్‌(Pak)లోని పంజాబ్‌ ప్రావిన్సు(Punjab province)లో కామ్రా(Kamra) వైమానిక స్థావరాన్ని సందర్శించిన ఆయన, భారత్‌తో చర్చలకు సిద్ధమన్నారు. పాక్‌ శాంతిని కోరుకుంటుందని, తమ ప్రాంతంలో అభివృద్ధి, శ్రేయస్సును కోరుకుంటున్నామని షెహబాజ్‌ పేర్కొన్నారు. అయితే, జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లోని అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్‌ స్పష్టం చేసింది.

Pakistan on Kashmir Issue : చర్చలకు సిద్ధంగా వున్నాం.. పాకిస్థాన్ ప్రధాని

కామ్రా వైమానిక స్థావరాన్ని పరిశీలించిన అధికారులు
ప్రధాని షరీఫ్​తో పాటు పాక్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్, ఇతర అధికారులు కామ్రా వైమానిక స్థావరాన్ని సందర్శించారు. కాగా భారత్ ఆపరేషన్ సిందూర్​ చేపట్టిన తర్వాత ప్రధానికి ఇది రెండో వైమానిక స్థావర పర్యటన. అంతకుముందు బుధవారం సియాల్​కోట్​ ఆర్మీ బేస్​ను సందర్శించారు. అక్కడ ఉన్న సైనికులతో ముచ్చటించారు.
మోదీని కాపీ కొట్టారంటూ సెటైర్లు
అయితే, పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీని కాపీ కొట్టడంపై నెటిజన్లు ఆయనను ఆడుకుంటున్నారు. భారత సైన్యం జరిపిన దాడుల్లో ధ్వంసమైన సియాల్‌కోట్‌లోని ఆర్మీబేస్‌ను పాక్‌ ప్రధాని సందర్శించారు. పంజాబ్‌లోని ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌ను మోదీ సందర్శించిన మరుసటిరోజే సియాల్‌కోట్‌లోని పస్పూర్‌ కంటోన్మెంట్‌ ప్రాంతానికి వెళ్లారు. తమ సైనికులతో పాక్‌ ప్రధాని ముచ్చటించారు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. ప్రధాని మోదీని పాక్‌ పీఎం కాపీ కొట్టారంటూ మీమర్లు షెహబాజ్‌పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. భారత్‌ చేతిలో ఓడిపోయినా పాక్ సంబరాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. ఓడిపోతే కూడా స్వీట్లు పంచుకుంటారా అని చురకలంటించారు.
కాల్పుల విరమణ ఒప్పందం పొడగింపు
మరోవైపు కాల్పుల విరమణపై ‘సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్‌’ (డీజీఎంవో) స్థాయిలో చేసుకున్న తాత్కాలిక ఒప్పందాన్ని ఈ నెల 18 వరకు కొనసాగించేందుకు భారత్, పాక్‌లు నిర్ణయం తీసుకున్నాయి. దీనికి ముందు భారత్‌ డీజీఎంవో లెఫ్టినెంట్‌ రాజీవ్‌ ఘాయ్, పాక్‌ డీజీఎంవో మేజర్‌ జనరల్‌ కష్రిఫ్‌ అబ్దుల్లాలు హాట్‌లైన్లో మాట్లాడుకుని నిర్ణయించారు.

Read Also: NDIA PAKISTAN: భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకారం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Pakistani Prime Minister Paper Telugu News ready for talks Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.