📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Ravi Shastri: ధోనీ‌ చేతుల నైపుణ్యాన్ని కొనియాడుతూ.. జేబు దొంగతో పోల్చిన రవి శాస్త్రి

Author Icon By Anusha
Updated: June 10, 2025 • 2:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ రవి శాస్త్రి, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని,జేబు దొంగతో పోల్చాడు. ధోనీ(Dhoni) వికెట్ కీపింగ్ నైపుణ్యాన్ని కొనియాడుతూ పిక్ పాకెటర్ అనే పదాన్ని ఉపయోగించాడు. జేబు దొంగ కంటే ధోనీ చేతులు వేగంగా ఉంటాయని ప్రశంసించాడు. ధోనీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) హాల్ ఫేమ్‌లో చేర్చింది. ఈ సందర్భంగా లండన్‌లో జరిగిన కార్యక్రమంలో రవి శాస్త్రి మాట్లాడుతూ ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు.

మెరుపు వేగంతో

ధోనీ చేతులు పిక్ పాకెటర్ కంటే వేగంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా భారత్‌లో ముఖ్యంగా అహ్మదాబాద్‌లోని ఒక పెద్ద మ్యాచ్‌కి వెళ్తే, మీ వెనుక ధోనీ ఉండకుండా చూసుకోండి. లేదంటే మీ పర్స్ మాయమైపోతుంది’అని రవి శాస్త్రి అనగా అక్కడ ఉన్న అందరు నవ్వారు.ధోనీ వేగవంతమైన వికెట్ కీపింగ్‌ను ప్రశంసిస్తూ, రవి శాస్త్రి(Ravi Shastri) ఈ వ్యాఖ్యలు చేశాడు. ధోనీ తన కెరీర్‌లో మెరుపు వేగంతో ఎన్నో స్టంపౌట్స్, రనౌట్స్ చేశాడు. ధోనీ ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉంటాడని రవి శాస్త్రి కొనియాడాడు. ‘ధోనీ సున్నాకి ఔట్ అయినా ప్రపంచ కప్ గెలిచినా సెంచరీ కొట్టినా, డబుల్ సెంచరీ సాధించినా ఒకేలా ఉంటాడు. అతనిలో ఏ మాత్రం తేడా కనిపించదు.’అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.

గౌరవంగా

హాల్ ఫేమ్‌లో చోటు దక్కడంపై ధోనీ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ప్రపంచవ్యాప్తంగా అన్ని తరాల క్రికెటర్ల సేవలను గుర్తించే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌(ICC Hall of Fame)లో చోటు లభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఎంతోమంది గొప్ప క్రికెటర్ల మధ్య నా పేరు ఉండబోతోందన్న భావనే అద్భుతంగా ఉంది. ఇది నా కెరీర్‌లో ఎప్పటికీ మరిచిపోలేని క్షణం. చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.’అని ధోనీ తెలిపాడు.

Ravi Shastri

నాయకత్వంలోనే

భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు (2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ) అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ గుర్తింపు పొందారు. అతని నాయకత్వంలోనే భారత్ 2009లో టెస్టుల్లో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఈ అసాధారణ విజయాలు, వికెట్ కీపర్‌గా అతని అద్భుతమైన ప్రతిభకు గుర్తింపుగా ఐసీసీ అతన్ని హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చింది.

ఆటగాళ్లు

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న భారత ఆటగాళ్లు వీరే,బిషన్ సింగ్ బేడీ – 2009,సునీల్ గవాస్కర్ – 2009,కపిల్ దేవ్ – 2009,అనిల్ కుంబ్లే – 2015,రాహుల్ ద్రవిడ్ – 2018,సచిన్ టెండూల్కర్ – 2019,వినూ మన్కడ్ – 2021,డయానా ఎడుల్జీ – 2023 (మొదటి భారతమహిళా క్రికెటర్),వీరేంద్ర సెహ్వాగ్ – 2023,నీతూ డేవిడ్ – 2024,మహేంద్ర సింగ్ ధోని – 2025.

Read Also: MPL 2025: టీ20 క్రికెట్‌లో అరుదైన ర‌నౌట్

#MSDhoni #PickpocketHands #RaviShastri #WicketkeepingLegend Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.