📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Quad Foreign: దక్షిణ చైనా సముద్రంపై క్వాడ్ తీవ్ర ఆందోళన

Author Icon By Vanipushpa
Updated: July 3, 2025 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణ చైనా(South China) సముద్రంలో జరుగుతున్న పరిణామాలు క్వాడ్ దేశాల(Quad Foreign)కు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్(S.Jaishankar) అన్నారు. వాషింగ్టన్‌(Washington)లో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భౌగోళికంగా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతాల్లో దక్షిణ చైనా సముద్రం ఒకటి. ఇక్కడ చైనా ఆక్రమణలు చేయడం సహా ఇతర దేశాల నావికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోంది.

క్వాడ్ దేశాల ఉమ్మడి స్థైర్యం

దీంతో చైనా చర్యలపై భారత్ సహా క్వాడ్ దేశాలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా, భారత్​, ఆస్ట్రేలియా, జపాన్ సభ్యులుగా ఉన్న క్వాడ్, ఈ సముద్ర మార్గాన్ని శాంతియుతంగా ఉంచేందుకు పరస్పరం కట్టుబడి ఉందని జైశంకర్ స్పష్టం చేశారు. ‘దక్షిణ చైనా సముద్రం అంశం మాకు అత్యంత కీలకం. ఇది అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యం గల సముద్ర మార్గం. ఇక్కడ వివాదాలు తలెత్తకుండా ఉండాలని క్వాడ్ సభ్యుల అభిప్రాయం’

Quad Foreign: దక్షిణ చైనా సముద్రంపై క్వాడ్ తీవ్ర ఆందోళన

ఇండో-పసిఫిక్‌లో శాంతికి క్వాడ్ కృషి
ఈ సమావేశంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని వ్యూహాత్మక, ఆర్థిక అంశాలపై, భాగస్వామ్య దేశాలతో కలసి శాంతి, భద్రత, అభివృద్ధిని ఎలా ప్రోత్సహించాలన్న దానిపై చర్చించామని జైశంకర్ తెలిపారు. ఫిన్‌టెక్, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలన్న ఆలోచనతో ఉన్నట్లు వెల్లడించారు. ప్రాంతంలోని అన్ని దేశాలు స్వేచ్ఛగా ఉండేలా చూడాలన్నదే క్వాడ్ సంకల్పమని చెప్పారు.

సముద్రంలో ప్రమాదకర పరిస్థితులపై ఆగ్రహం
దక్షిణ చైనా సముద్రంలో చైనా ‘9-డాష్ లైన్’ విధానాన్ని అమలు చేయడం, వివాదాస్పద దీవులను మిలిటరైజ్ చేయడం భారత్‌, క్వాడ్ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. చైనా చర్యలను యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (యూఎన్ సీఎల్ఓసీ) ఉల్లంఘనగా భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో క్వాడ్ సమావేశం అనంతరం సభ్య దేశాలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో జరుగుతున్న ఆక్రమణలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ప్రస్తుత స్థితిని మార్చే చైనా ఏకపక్ష చర్యలపై మండిపడ్డాయి. నేవీ, విమానాల స్వేచ్ఛకు అడ్డుపడటం, కోస్ట్ గార్డ్ నౌకలు, సైనిక విమానాల ద్వారా ప్రమాదకర పరిస్థితులను సృష్టించడంపై తీవ్రమైన నిరసనను వ్యక్తం చేశాయి. ఇవన్నీ శాంతి, భద్రతకు ముప్పుగా మారుతున్నాయని చెప్పాయి.

ఇండో-పసిఫిక్‌లో శాంతి కోసం క్వాడ్ వ్యూహం

యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (యూఎన్ సీఎల్ఓఎస్) ప్రకారమే క్వాడ్ దేశాలు నేవీ స్వేచ్ఛ, నిర్బంధ రహిత వాణిజ్యం వంటి అంశాలను పూర్తిగా సమర్థిస్తున్నట్లు ప్రకటించాయి. వివాదాస్పద ద్వీపాల మిలిటరైజేషన్ పట్ల కూడా క్వాడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ తన ఆర్థిక అభివృద్ధి, వ్యాపార మార్గాలు, పెరుగుతున్న నౌకా రవాణా, సముద్ర భద్రత పరిరక్షణ కోణంలో దక్షిణ చైనా సముద్రాన్ని అత్యంత కీలకంగా భావిస్తోంది. ఈ సముద్ర మార్గంలో భారత్‌కు చెందిన వాణిజ్య నౌకల రాకపోకలు అత్యధికంగా ఉంటాయి. ఇది ఇండో-పసిఫిక్ వ్యూహంలో భాగంగా మాలాక్కా స్ట్రెయిట్ ద్వారా చైనా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలతో భారత్ నిర్వహించే వాణిజ్యంలో ఇది అత్యంత కీలకమైన మార్గం.

భారత్‌కు దక్షిణ చైనా సముద్రం ఎందుకు కీలకం?
భారత వాణిజ్య నౌకా రవాణాలో ఈ మార్గం కీలకం మాలాక్కా స్ట్రెయిట్ ద్వారా చైనా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలతో వాణిజ్య సంబంధాలు, భద్రత, ఆర్థిక ప్రయోజనాలు, వ్యూహాత్మక భద్రత కోసం ఈ సముద్ర మార్గం కీలకం. చైనా ఏకపక్ష చర్యలను ఖండన, దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో స్వేచ్ఛా రవాణాకు మద్దతు, విమానాలు, నౌకల కదలికలను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించటం, శాంతిని భంగం చేసే చర్యలకు వ్యతిరేకంగా ఉమ్మడి ఆందోళన.

Read Also: Bali Boat: బాలిలో పడవ ప్రమాదం: నలుగురు మృతి, 61 మంది గల్లంతు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu china aggression in south china sea disputed islands militarization freedom of navigation Google News in Telugu india us japan australia quad indo pacific quad alliance jaishankar south china sea Latest News in Telugu malacca strait india trade Paper Telugu News quad joint statement quad meeting 2025 south china sea security concern Telugu News online Telugu News Paper Telugu News Today unclos china violations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.