📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Qatar: ఖతార్‌ రాజ కుటుంబం ట్రంప్‌కి లగ్జరీ విమానం గిఫ్ట్

Author Icon By Vanipushpa
Updated: May 12, 2025 • 11:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ (Donald Trump) మిడిల్ ఈస్ట్ పర్యటనకు రానుండగా.. ఖతార్‌ (Qater) రాజ కుటుంబం నుంచి ఖరీదైన బహుమతి అందుకోనున్నారు. విలాసవంతమైన 747-8 విమానాన్ని(Flight) ట్రంప్‌కు అందజేయనున్నట్టు సమాచారం. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌‌ (Airforce one)కు తగ్గట్టుగా దీనిలో మార్పులు చేయనున్నారు. ట్రంప్ 2029 జనవరిలో అధ్యక్ష పీఠం దిగిపోయేవరకూ ఈ విమానాన్ని ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’కు కొత్త వెర్షనుగా వినియోగిస్తారు. అనంతరం అధ్యక్ష గ్రంథాలయ ఫౌండేషన్‌కు అప్పగిస్తారు. ఖతార్‌‌లో పర్యటించే సమయంలో ఈ కానుకను ప్రకటించే అవకాశం ఉంది. ఈ విమానం విలువ సుమారు 400 మిలియన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.3400 కోట్లు) ఉంటుంది. కాగా, ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఖతార్ పాలకులు ఒకరు. ఇటీవల భారత్‌ పర్యటనకు వచ్చిన ఖతార్ పాలకుడికి మోదీ స్వయంగా వెళ్లి స్వాగతం చెప్పారు.

Qatar :ఖతార్‌ రాజ కుటుంబం ట్రంప్‌కి లగ్జరీ విమానం గిఫ్ట్

అయితే, దీనిపై ఖతార్‌ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా ఉపయోగించుకునేలా ఒక విమానాన్ని అందజేయడంపై అమెరికాతో చర్చలు జరిగాయి’ అని అంగీకరించింది. కానీ, .ఇది గిఫ్ట్ అనే పదం వాడలేదు. ఈ ప్రకటన తర్వాత ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం Truth Social‌లో పెట్టిన పోస్ట్ కానుకను స్వీకరిస్తున్నట్టు ధ్రువీకరించేలా ఉంది.

400 మిలియన్ డాలర్లు విలువగల బోయింగ్ 747-8 విమానం
అంతకుముందు ఏబీసీ మీడియా (ABC Media).. అనేక వర్గాలను ఉటంకిస్తూ.. ఖతారీ రాజ కుటుంబం అందించబోయే సుమారు 400 మిలియన్ డాలర్లు విలువగల బోయింగ్ 747-8 విమానం.. ‘ఎయిర్ ఫోర్స్ వన్”గా ఉపయోగించడానికి ట్రంప్‌ యంత్రాంగం సిద్ధం చేసినట్టు నివేదించింది. ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్క్ చేసి ఈ విమానాన్ని ట్రంప్ సందర్శించినట్టు తెలిపింది. అయితే, దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఓ రకంగా లంచమే? అని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు.
‘అమెరికా ఫస్ట్’ అంటే ఇలానా?

ఖతార్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం అందించడమేనా?.. ఇది కేవలం లంచం మాత్రమే కాదు.. అదనపు ప్రయోజనం.. విదేశీ ప్రభావం’ అని డెమొక్రాట్ నేత ,సెనెట్ మైనార్టీ లీడర్ చక్ షూమర్ ఆక్షేపించారు. ‘విదేశాల నుంచి కానుకలను స్వీకరించాలంటే అమెరికా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలని మన రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందని, విమానం నాలుగు సంవత్సరాలు వాడుకుని తర్వాత అధ్యక్ష లైబ్రరీకి పంపినా అది లంచంగానే పరిగణిస్తారు’అని మరో ప్రతిపక్ష సభ్యుడు, మెరిల్యాండ్‌ డెమొక్రాట్ కాంగ్రెస్‌మెన్ జేమీ రాస్కి ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Read Also: Ajit Doval : చైనా విదేశాంగ మంత్రితో దోవల్ ఫోన్లో సంభాషణ

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Qatari royal family Telugu News online Telugu News Paper Telugu News Today Trump luxury plane

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.