📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistani PM: అమృత్​సర్​లోని గ్రామంలో ప్రధాని షెహబాజ్ పూర్వీకుల మూలాలు

Author Icon By Vanipushpa
Updated: May 20, 2025 • 4:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్(Bharath-Pakistan) మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న వేళ పాకిస్థాన్(Pakistan) ప్రధానికి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. భారత్​లో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్​,(Shahbaz Sharif) ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్(Navaz Sharif) షరీఫ్​ కుటుంబానికి ఇండియాలో ఇష్టమైన గ్రామం ఒకటి ఉంది.
అమృత్​సర్​లోని జాతి ఉమ్రా
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్​ కుటుంబానికి భారత్​లోని పంజాబ్​తో ప్రత్యేక సంబంధం ఉంది. ​వాళ్ల పూర్వీకుల గ్రామం అమృత్​సర్​లోని జాతి ఉమ్రా. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్​ల పూర్వీకుల మూలాలు జాతి ఉమ్రా గ్రామంలో ఉన్నాయి. అది అమృత్​సర్​ నుంచి 35-40కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ విలేజ్ అంటే షరీఫ్ కుటుంబానికి అమితమైన ఇష్టమని స్థానికులు అంటున్నారు. కానీ, ప్రస్తుత ఉద్రిక్తల వేళ తాము సంతోషంగా లేమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Pakistani PM: అమృత్​సర్​లోని గ్రామంలో ప్రధాని షెహబాజ్ పూర్వీకుల మూలాలు

గురుద్వార్​గా మారింది
షరీఫ్​ కుంటుంబ సభ్యులు జాతి ఉమ్రాలో ఉండేవారని, వారిని అందరూ చాలా గౌరవించేవారని స్థానికులు చెబుతున్నారు. జాతి ఉమ్రా గ్రామంలో ఉన్న షరీఫ్​ పూర్వీకుల ఇల్లు ఇప్పుడు ఒక గురుద్వార్​గా మారిందని, అందులో ఒక లంగర్​ హాల్​ కూడా నిర్మిస్తున్నట్లు స్థానికుడు హర్దీప్ సింగ్ తెలిపారు. ‘తొలుత అక్కడ షరీఫ్ కుటుంబానికి చెందిన ఓ పెద్ద హవేలీ(భవనం) ఉండేది. దీనిని 1976లో నవాజ్ షరీఫ్ సోదరుడు అబ్బాస్ షరీఫ్ మా గ్రామానికి విరాళంగా ఇచ్చారు. ఆయన ఒక వ్యాపారవేత్త. తరచూ ఈ ప్రాంతానికి వచ్చేవారు. 2013లోనే ఆయన మరణించారు.
షరీఫ్ కుటుంబానికి చెందిన భవనాలు, ఆస్తులు
షరీఫ్​ కుటుంబానికి ఈ గ్రామం మీద ప్రేమ ఇంకా ఉందని స్థానికులు అంటున్నారు. పాకిస్థాన్​లో కూడా ఇదే పేరుతో జాతీఉమ్రా అనే గ్రామాన్ని ఏర్పాటు చేేశారు. ఇక నవాజ్ షరీఫ్ పూర్వీకుల సమాధులు కూడా అమృత్​సర్​లోని జాతీఉమ్రాలో ఇంకా అలాగే ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఈ గ్రామంలో షరీఫ్ కుటుంబానికి చెందిన భవనాలు, ఆస్తులు ఉన్నాయి. నవాజ్ షరీఫ్ మనవడు జైద్ హుస్సేన్ నవాజ్ వివాహం కూడా ఇక్కడే జరిగింది. చాలా కాలం పాటు గ్రామస్థులు వారి కుటుంబంతో సంబంధాలు కొనసాగించారు. కాలక్రమేణా ఇరు దేశాల మధ్య కఠినమైన పరిస్థితులు ఎదురుకావడం వల్ల సంబంధాలు నిలిచిపోయాయి.
షరీఫ్ కుటుంబం గ్రామానికి చాలా చేసింది
రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని హర్దీప్​ సింగ్ అశాభావం వ్యక్తం చేశారు. ‘ భారత్-పాక్ మధ్య వ్యాపార సంబంధాలు మెరుగవ్వాలి. షరీఫ్ కుటుంబం గ్రామానికి చాలా చేసింది. గ్రామస్థుల అభ్యర్థనపై 2013లో స్టేడియం నిర్మించారు. షరీఫ్ కుటుంబ నుంచి ఎవరైనా ప్రధాని, సీఎం ఇలా ముఖ్యమైన పదవులు చేపడితే మాకు చాలా గర్వంగా ఉంటుంది. కానీ ఏదైనా తప్పు జరిగినప్పుడు ‘మీ గ్రామానికి చెందిన ప్రధాని ఎందుకు అలా చేస్తున్నారు’ అని అన్నప్పుడు మాకు సిగ్గుగా అనిపిస్తుంది. భారత్‌పై ఇలా మిసైల్స్, బాంబులు వేస్తే, నష్టం మాత్రమే కాదు పాకిస్థాన్​ను ఆ దేశమే దెబ్బ తీసుకోవడమే అవుతుంది, ఎందుకంటే వారి గ్రామం ఇక్కడే ఉంది. షరీఫ్ కుటుంబానికి కూడా నష్టం జరుగుతుంది.

Read Also: Sofia qureshi : సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు..SIT ఏర్పాటు

#telugu News ancestral roots Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Prime Minister Shehbaz's Telugu News online Telugu News Paper Telugu News Today village in Amritsar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.