📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pope Francis : మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూత

Author Icon By sumalatha chinthakayala
Updated: April 21, 2025 • 2:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Pope Francis : కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధుపడుతున్న ఆయన వాటికన్ సిటీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను వాటికన్ కామెరెలెంగో కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ ప్రకటించారు. ఆయన జీవితమంతా ప్రభువు, చర్చి సేవకు అంకితం చేశారని ప్రకటనలో పేర్కొన్నారు. కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ శ్వాసకోశ సమస్యలు, డబుల్‌ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న విషయం తెలిసిందే.

అమెరికా నుంచి వచ్చిన మొదటి పోప్‌గా ఫ్రాన్సిస్

ఫిబ్రవరి 14న ఆసుపత్రిలో చేరిన ఆయన.. 38 రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. గత నెల డిశ్చార్జి కాగా.. సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. 1938లో అర్జెంటీనాలో జన్మించిన ఆయన 2013లో 16వ పోప్‌ బెనిడెక్ట్‌ తర్వాత పోప్‌గా బాధ్యతలు చేపట్టారు. ఫ్రాన్సిస్ మరణంతో కొత్త పోప్‌ను ఎన్నుకునే ప్రక్రియ సాధారణంగా 15 నుంచి 20 రోజుల తర్వాత ప్రారంభమవుతుంది. అమెరికా నుంచి వచ్చిన మొదటి పోప్‌గా ఫ్రాన్సిస్ నిలిచారు.

ఆయన్ను ప్రజల పోప్‌ అంటారు

ఫ్రాన్సిస్‌ 1938లో అర్జెంటీనాలో జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి ఈ పదవిని అందుకొన్న తొలి వ్యక్తి ఆయనే. ఆయన్ను ప్రజల పోప్‌ అంటారు. తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు. 2016లో రోమ్‌ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడిగారు. దీనిని ఆయన వినయం, సేవాతత్పరతకు చిహ్నంగా భావిస్తారు.

Read Also: జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం..ఢిల్లీలో భద్రత పెంపు

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Passed Away Pope Francis religious leader Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.