Pope Francis : కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధుపడుతున్న ఆయన వాటికన్ సిటీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను వాటికన్ కామెరెలెంగో కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ ప్రకటించారు. ఆయన జీవితమంతా ప్రభువు, చర్చి సేవకు అంకితం చేశారని ప్రకటనలో పేర్కొన్నారు. కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న విషయం తెలిసిందే.

అమెరికా నుంచి వచ్చిన మొదటి పోప్‌గా ఫ్రాన్సిస్
ఫిబ్రవరి 14న ఆసుపత్రిలో చేరిన ఆయన.. 38 రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. గత నెల డిశ్చార్జి కాగా.. సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. 1938లో అర్జెంటీనాలో జన్మించిన ఆయన 2013లో 16వ పోప్ బెనిడెక్ట్ తర్వాత పోప్‌గా బాధ్యతలు చేపట్టారు. ఫ్రాన్సిస్ మరణంతో కొత్త పోప్‌ను ఎన్నుకునే ప్రక్రియ సాధారణంగా 15 నుంచి 20 రోజుల తర్వాత ప్రారంభమవుతుంది. అమెరికా నుంచి వచ్చిన మొదటి పోప్‌గా ఫ్రాన్సిస్ నిలిచారు.
ఆయన్ను ప్రజల పోప్ అంటారు
ఫ్రాన్సిస్ 1938లో అర్జెంటీనాలో జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి ఈ పదవిని అందుకొన్న తొలి వ్యక్తి ఆయనే. ఆయన్ను ప్రజల పోప్ అంటారు. తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడిగారు. దీనిని ఆయన వినయం, సేవాతత్పరతకు చిహ్నంగా భావిస్తారు.
Read Also: జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం..ఢిల్లీలో భద్రత పెంపు