📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Narendra Modi: పహల్గామ్ దాడిపై పిఎమ్ సంచలన వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: April 27, 2025 • 5:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పందించారు. ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో దేశాన్ని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ పహల్గామ్ దాడి ఉగ్రవాదుల అసహనానికి, పిరికితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘కశ్మీర్‌లో మళ్లీ శాంతి నెలకుంటోంది.. పాఠశాలలు, కళాశాలలు ఉల్లాసంగా ఉన్నాయి, గతంలో ఎన్నడూ లేనంత వేగంగా అభివృద్ధి పనులు జరిగాయి, ప్రజాస్వామ్యం బలపడుతోంది, పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది, ఆదాయాలు పెరుగుతున్నాయి, యువతకు కొత్త అవకాశాలు వచ్చాయి. ఈ అభివృద్దిని, జమ్మూ కశ్మీర్ శత్రువులు భరించలేకపోయారు’ అని ప్రధాని చెప్పారు.

ప్రపంచం

ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వారినైనా, ఏ భాష మాట్లాడే వారినైనా, ఏ భారతీయుడినైనా ఏప్రిల్ 22 నాటి ఉగ్రదాడి తీవ్రంగా కలచివేసిందని ప్రధాని అన్నారు. ‘ఉగ్రదాడి ఫోటోలను చూసిన ప్రతి భారతీయుడి రక్తం ఆగ్రహంతో మరిగిపోతోంది’ అని చెప్పారు. ప్రపంచం మొత్తం భారత్‌తో ఉందని ప్రధాని పేర్కొన్నారు. ‘బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని నేను హామీ ఇస్తున్నాను. ఈ దాడి వెనుక ఉన్నవారు కఠినమైన శిక్ష అనుభవించక తప్పదు ఉగ్రవాదులు, వారి మాస్టర్లు కశ్మీర్‌ను నాశనం చేయాలనే కుట్రను పన్నారు’ అని పేర్కొన్నారు.ఉగ్రవాదంపై మేము సాగిస్తోన్న యుద్ధానికి 140 కోట్ల మంది భారతీయుల ఐక్యతే అత్యంత పెద్ద బలం ఇదే మన నిర్ణాయక పోరాటానికి బలమైన పునాది. ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు మన ఆత్మస్థైర్యాన్ని బలోపేతం చేయాలి.అని ప్రధాని అన్నారు.

ప్రభుత్వం

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో బైసరన్ లోయలో 25 మంది పర్యాటకులు, ఒక కశ్మీరీని ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఇది కశ్మీర్ చరిత్రలో జరిగిన అత్యంత భయానకమైన ఉగ్రదాడులలో ఒకటి. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను గుర్తించి, వెంటాడి, శిక్షించడమే లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. “మన మనోభావాలను ఏదీ దెబ్బతీయలేవు’ అని మోదీ ఉద్ఘాటించారు.‘దేశం మొత్తం బాధిత కుటుంబాల వెంట ఉంది… గాయపడినవారిని సంరక్షించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేస్తోంది. కొడుకులను, తోబుట్టువులను, జీవిత భాగస్వామిలను కోల్పోయారు. చనిపోయింది బెంగాలీనా, కన్నడనా, మరాఠీనా, ఒడియానా, గుజరాతీనా, బిహారీనా అనేది కాకుండా కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకూ తీవ్ర దుఃఖం, ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ దాడి కేవలం పర్యాటకులపై మాత్రమే కాదు; శత్రువులు భారతీయుల ఆత్మపై దాడి చేసినట్లుగా ఉంది’’ అని గత వారం బీహార్‌లోని ఓ సభలో ప్రధాని చెప్పారు.ఈ దాడికి కారకులైన ప్రతిఒక్కరూ ఊహించలేని శిక్షను ఎదుర్కొంటారని ప్రధాని హెచ్చరించారు. ‘ఉగ్రవాద శిబిరాల వారి అవశేషాలను నిర్మూలించడానికి సమయం వచ్చింది 140 కోట్ల ప్రజల సంకల్పబలంతో ఉగ్రవాద మాస్టర్ల వెన్ను విరుస్తాం’ అని పాకిస్థాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Read Also :Investment: కూతురి స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టని బిల్ గేట్స్

#IndiaStrikesBack #narendramodi #NationalSecurity #pakistan #Terrorism #ZeroTolerance Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.