📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

PM Modi: ఆపరేషన్ సింధూర్‌ తర్వాత జాతినుద్దేశించి ప్రధాని మోదీ సందేశం..

Author Icon By Vanipushpa
Updated: May 12, 2025 • 5:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Mod) ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. అయితే.. ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) ప్రారంభమయ్యాక తొలిసారి ప్రసంగం చేయనున్నారు. దీంతో అందరి చూపు ప్రధాని మోదీ ప్రసంగం పైనే ఉంది.. పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడికి ప్రతికారం తర్వాత మాట్లాడనున్న మోదీ.. దేశప్రజలకు ఏం చెప్పనున్నారు.. పాకిస్తాన్ కు ఎలాంటి వార్నింగ్ ఇవ్వనున్నారు..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఉగ్రవాదం అంతానికి ఆపరేషన్ సింధూర్ ద్వారా చేపట్టిన చర్యలను ప్రధాని మోదీ ప్రజలకు వివరించనున్నారు. కాగా.. ఉగ్రవాదులను.. వారికి మద్దతు ఇచ్చే వారిని మట్టిలో కలిపేస్తాననీ, ఎవరు ఊహించని విధంగా ఉగ్రవాదులను శిక్షిస్తామని మోదీ ఇప్పటికే స్పష్టంచేశారు.

PM Modi: ఆపరేషన్ సింధూర్‌ తర్వాత జాతినుద్దేశించి ప్రధాని మోదీ సందేశం..

9 ఉగ్ర శిబిరాలను నేలమట్టం
కాగా.. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం.. పాకిస్తాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టి.. పాకిస్తాన్, పీఓకేలో కీలకంగా ఉన్న 9 ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది.. దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ క్రమంలోనే.. పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో.. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది..
ప్రధాని నివాసంలో అత్యున్నతస్థాయి సమావేశం
ఇదిలాఉంటే.. ఉదయం ప్రధాని నివాసంలో అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఎన్‌ఎస్ఏ అజిత్ దోవల్ ,సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. భారత్‌, పాక్‌ డీజీఎంవో అధికారుల చర్చల నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు.
సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి..
సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో జమ్మూకశ్మీర్‌లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియా – పాకిస్తాన్‌ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నడుమ మూడు రోజుల పాటు కాల్పుల మోతతో సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్‌లలో ప్రజలు వణికిపోయారు. LOC వెంట కూడా కాల్పుల మోత మోగింది. అయితే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో శనివారం దానిని ఉల్లంఘించిన పాక్ ఆదివారం మాత్రం మౌనంగానే ఉంది. భారత్ సరిహద్దు ప్రాంతం ప్రశాంతంగా నిద్రపోయింది. కొద్దిరోజుల నుంచి సరిహద్దు రాష్ట్రాల్లో తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే సమసిపోయి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు సాధారణ జనజీవనం గడుపుతున్నారు.
కాల్పుల విరమణ ఒప్పందం
అయినప్పటికీ, సరిహద్దుల్లోఆర్మీ నిరంతర నిఘా కొనసాగిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని చెబుతోంది. కాల్పుల విరమణ ఒప్పందంతో అఖ్నూర్, రాజౌరి, పూంచ్‌ జిల్లాల్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: India-pak: భారత్ పై ఈగ వాలినా చూస్తాం! పాక్ కు ఇస్రో చైర్మన్ వార్నింగ్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Operation Sindhur Paper Telugu News PM Modi's message Telugu News online Telugu News Paper Telugu News Today to the nation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.