ప్రధాని మోదీ(Modi) మరికొన్ని రోజుల్లో ఇజ్రాయెల్ వెళ్లనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఓ సదస్సులో ఈ విషయాన్ని తెలిపారు. వచ్చే వారం తమ పార్లమెంటును ఉద్దేశించి మోదీ ప్రసంగం చేయనున్నట్లు వివరించారు. ” ఇండియా-ఇజ్రాయెల్ మధ్య మంచి స్నేహం ఉంది. ఇరు దేశాల మధ్య సహకారంపై మేము చర్చలు జరపనున్నాం. భారత్‌లో 140 కోట్ల మంది ప్రజలున్నారు. అది చాలా శక్తిమంతమైన దేశమని” నేతన్యాహూ అన్నారు.
Read Also: AI Impact Summit: ప్రపంచ దేశాలకు దిక్చూచిలా మారనున్న భారత్
గాజా యుద్ధం తర్వాత ఇదే మొదటి పర్యటన
మరోవైపు ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. ఒకవేళ ఆయన వెళ్తే.. ఇది రెండో పర్యటన కానుంది. గాజా యుద్ధం తర్వాత ఇదే మొదటి పర్యటన అవుతుంది. గతంలో 2017లో జులైలో ప్రధాని ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఒకవేళ ప్రధాని ఇజ్రాయెల్‌కు వెళ్తే.. పశ్చిమాసిలో శాంతి, భద్రతల గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయ రంగాల్లో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగే ఛాన్స్ ఉంది. రక్షణ పరంగా చూసుకుంటే డ్రోన్ టెక్నాలజీ, క్షిపణి వ్యవస్థలు, నిఘా, సెన్సార్లు, సెమీకండక్టర్లకు సంబంధించి ఒప్పందం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: