PM Modi: గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు

Read Time:  1 min
PM Modi
PM Modi
FONT SIZE
GET APP

ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ మాత్రం వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తోంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్, అమెరికాతో ట్రేడ్ ఒప్పందాల దిశగా కదులుతున్న భారత్, తాజాగా గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (GCC)లోని ఆరు దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) కోసం చర్చలకు శ్రీకారం చుట్టింది.

Read Also:Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై గోయల్ కీలక వ్యాఖ్యలు

PM Modi

GCCతో ఒప్పందం కుదిరితే ఎగుమతులు–పెట్టుబడులకు ఊపు

ఈ ఒప్పందం అమల్లోకి వస్తే భారత(PM Modi) ఎగుమతులకు కొత్త మార్కెట్లు తెరుచుకోనున్నాయి. అదే సమయంలో విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గల్ఫ్ దేశాలతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు మరింత బలపడనున్నాయి.

ప్రస్తుతం UAE, ఒమన్‌తో భారత్ ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలను అమలు చేస్తోంది. ఇప్పుడు సౌదీ అరేబియా, ఖతర్, కువైట్, బహ్రెయిన్ వంటి కీలక దేశాలతోనూ FTA కుదిరితే, గల్ఫ్ ప్రాంతంలో భారత్(PM Modi) స్థానం మరింత పటిష్టమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.