📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

PM Modi: ఏఐ డీప్‌ఫేక్‌లపై ప్రధాని మోదీ ఆందోళన

Author Icon By Anusha
Updated: June 18, 2025 • 1:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం ఏఐ ఆధారిత కంటెంట్ వేగంగా విస్తరిస్తోంది. దీనిలో భాగంగా డీప్‌ఫేక్‌లను తయారుచేయడం ఎంతో తేలికగా మారింది. ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉన్న ఈ కంటెంట్ వల్ల వ్యక్తిగత జీవితాలు, రాజకీయ వ్యవస్థలు, అంతర్జాతీయ సంబంధాలు కూడా ప్రభావితమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, ఏఐతో రూపొందించిన వీడియోలు, ఫొటోలు, ఆడియో కంటెంట్‌ను ప్రజలు నిజం అని నమ్ముతారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న సమయంలో, దానికి సంబంధించిన సవాళ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తన తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా డీప్‌ఫేక్‌ల వల్ల ఏర్పడుతున్న సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రపంచ దేశాలు దీనిపై ఒక సమగ్రమైన దృష్టికోణం అవలంబించాలని పిలుపునిచ్చారు. కెనడాలోని ఆల్‌బెర్టా ప్రావిన్స్‌లో జరుగుతున్న జీ7 (G7) దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఏఐ ద్వారా రూపొందించే కంటెంట్‌కు తప్పనిసరిగా వాటర్‌మార్కింగ్ ఉండాలని లేదా అది ఏఐ సృష్టించినదనే స్పష్టమైన ప్రకటన ఉండాలని అభిప్రాయపడ్డారు.

ప్రమాదాలను తగ్గించేందుకు

ప్రస్తుత యుగం ఏఐదే అయినప్పటికీ, సాంకేతికతతో కూడిన వ్యవస్థలను సురక్షితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన నొక్కిచెప్పారు. డీప్‌ఫేక్ కంటెంట్ (Deepfake content) వల్ల తలెత్తే ప్రమాదాలను తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రజలకు అందుబాటు ధరల్లో, నమ్మకమైన, స్థిరమైన సాంకేతిక వ్యవస్థలను అందించడమే భారత్‌ ప్రధాన లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు ప్రయోజనం చేకూర్చినప్పుడే దానికి నిజమైన విలువ ఉంటుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏ దేశాన్ని కూడా వెనుకబడనివ్వకూడదని ఆయన అన్నారు. 

PM Modi

పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్

ఈ తరహా అభివృద్ధి చెందిన సాంకేతికతను నియంత్రించేందుకు అంతర్జాతీయంగా ఒక విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టంగా తెలిపారు.భారత్‌ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామ్యబద్ధం చేసిందని, తద్వారా ఆర్థిక వ్యవస్థ (Economic system) ను పటిష్టం చేయడంతో పాటు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా సామాన్య ప్రజలను కూడా శక్తివంతం చేసిందని ఆయన వివరించారు. ఈ సంద‌ర్భంగా సమగ్రమైన, సామర్థ్యవంతమైన, బాధ్యతాయుతమైన ఏఐ వ్యవస్థ ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.

Read Also: South Central Railway: ఇకపై ఎవరైనా రైళ్లపై రాళ్ల దాడి చేస్తే జైలు శిక్ష తప్పదు

#AIEthics #AIThreats #DeepfakeAwareness #ModiAtG7 #PMModiSpeech #TechForGood Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.