ప్రస్తుతం ఏఐ ఆధారిత కంటెంట్ వేగంగా విస్తరిస్తోంది. దీనిలో భాగంగా డీప్‌ఫేక్‌లను తయారుచేయడం ఎంతో తేలికగా మారింది. ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉన్న ఈ కంటెంట్ వల్ల వ్యక్తిగత జీవితాలు, రాజకీయ వ్యవస్థలు, అంతర్జాతీయ సంబంధాలు కూడా ప్రభావితమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, ఏఐతో రూపొందించిన వీడియోలు, ఫొటోలు, ఆడియో కంటెంట్‌ను ప్రజలు నిజం అని నమ్ముతారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న సమయంలో, దానికి సంబంధించిన సవాళ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తన తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా డీప్‌ఫేక్‌ల వల్ల ఏర్పడుతున్న సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రపంచ దేశాలు దీనిపై ఒక సమగ్రమైన దృష్టికోణం అవలంబించాలని పిలుపునిచ్చారు. కెనడాలోని ఆల్‌బెర్టా ప్రావిన్స్‌లో జరుగుతున్న జీ7 (G7) దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఏఐ ద్వారా రూపొందించే కంటెంట్‌కు తప్పనిసరిగా వాటర్‌మార్కింగ్ ఉండాలని లేదా అది ఏఐ సృష్టించినదనే స్పష్టమైన ప్రకటన ఉండాలని అభిప్రాయపడ్డారు.
ప్రమాదాలను తగ్గించేందుకు
ప్రస్తుత యుగం ఏఐదే అయినప్పటికీ, సాంకేతికతతో కూడిన వ్యవస్థలను సురక్షితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన నొక్కిచెప్పారు. డీప్‌ఫేక్ కంటెంట్ (Deepfake content) వల్ల తలెత్తే ప్రమాదాలను తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రజలకు అందుబాటు ధరల్లో, నమ్మకమైన, స్థిరమైన సాంకేతిక వ్యవస్థలను అందించడమే భారత్ ప్రధాన లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు ప్రయోజనం చేకూర్చినప్పుడే దానికి నిజమైన విలువ ఉంటుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏ దేశాన్ని కూడా వెనుకబడనివ్వకూడదని ఆయన అన్నారు.

పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
ఈ తరహా అభివృద్ధి చెందిన సాంకేతికతను నియంత్రించేందుకు అంతర్జాతీయంగా ఒక విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టంగా తెలిపారు.భారత్ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామ్యబద్ధం చేసిందని, తద్వారా ఆర్థిక వ్యవస్థ (Economic system) ను పటిష్టం చేయడంతో పాటు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా సామాన్య ప్రజలను కూడా శక్తివంతం చేసిందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా సమగ్రమైన, సామర్థ్యవంతమైన, బాధ్యతాయుతమైన ఏఐ వ్యవస్థ ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.
Read Also: South Central Railway: ఇకపై ఎవరైనా రైళ్లపై రాళ్ల దాడి చేస్తే జైలు శిక్ష తప్పదు