విచిత్రమైన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. సముద్ర తీరంలో ఒక విమానం… కొంతమంది మోకాళ్ల లోతు నీళ్లలోనుండి నడుచుకుంటూ రావడం… సినిమా సన్నివేశంలా కనిపించిన ఈ దృశ్యం నిజంగా జరిగింది. సోమాలియా రాజధాని మొగాదిషులో జరిగిన ఈ అద్భుత ఘటనలో 55 మంది ప్రాణాలతో బయటపడటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పైలట్ తీసుకున్న క్షణకాల నిర్ణయం పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. మంగళవారం ఉదయం సోమాలియాలోని రాజధాని మొగాదిషు(Mogadishu) లో ఉన్న Aden Adde International Airport నుంచి బయలుదేరిన స్టార్‌స్కై ఏవియేషన్‌కు చెందిన ఫోకర్–50 విమానంలో గాల్లోకి లేచిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. విమానాన్ని నడుపుతున్న పైలట్ సమస్యను గుర్తించి వెంటనే తిరిగి ల్యాండింగ్‌కు సిద్ధమయ్యాడు. ఈ విమానాశ్రయం, హిందూ మహాసముద్రతీరంలోనే ఉంటుంది. రన్‌వేకు కొంచెం దూరంలోనే తీరం ఉండటం గమనార్హం.
Read Also: Tax: మీల్స్ పన్ను మినహాయింపు పెంపు ప్రతిపాదన
పైలట్ చాకచక్యంలో విమానం అదుపు
సిబ్బంది తెలిపిన ప్రకారం, విమానం రన్‌వేను తాకినా, ఆగలేదు. అలాగే ముందుకు దూసుకెళ్లిన విమానం సముద్రం వైపు ప్రయాణించి హిందూ సముద్రపు బీచ్‌లో ప్రవేశించింది. పైలట్ చాకచక్యంలో విమానాన్ని అదుపు చేసి ఆపగలిగాడు. అలల మధ్య ఇసుకలో ఆగిపోయిన విమానం దృశ్యం అక్కడి ప్రజలను షాక్‌కు గురిచేసింది. ఇక ప్రయాణీకుల పరిస్థితి చెప్పే అవసరం లేదు. తమ ప్రాణాలు గాల్లో కలిసాయనుకున్న వారందరూ నీళ్లలోనుండి బయటకొచ్చారు. వారికే కాదు, అందరికీ జరిగిందొక అద్భుత ఘటన. విమానంలో అయిదుగురు సిబ్బంది, 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సాధారణంగా అమలు చేసే ఎమర్జెన్సీ ఎగ్జిట్ విధానాన్ని సిబ్బంది వెంటనే ప్రారంభించారు. రక్షణ వాహనాలు చేరుకునేలోపు ప్రయాణికులు విమానం నుంచి బయటకు వచ్చి బీచ్ మీదుగా నీళ్లలో నడుచుకుంటూ సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: