గుజరాత్(Gujarath)లోని అహ్మదాబాద్(Ahmedabad)లో ఎయిరిండియా విమానం కూలింది. మేఘానిలోని గుజ్‌సెల్ విమానాశ్రయ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో 242 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది.
పీజీ వైద్య విద్యార్థుల హాస్టల్ భవనం మీద కూలిన విమానం
పీజీ వైద్య విద్యార్థుల హాస్టల్ భవనం మీద కూలిన విమానం
బీజే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కూలిన విమానం
ఘటనలో పలువురు పీజీ వైద్య విద్యార్థులు చనిపోయినట్లు సమాచారం
భోజన సమయం కావడంతో హాస్టల్‌లోనే అధికశాతం వైద్య విద్యార్థులు
ఈ బాధను మాటల్లో చెప్పలేను: అమిత్ షా
విమాన ప్రమాదం మాటల్లో చెప్పలేని బాధను కలిగించిందని కేంద్ర హోమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. విపత్తు ప్రతిస్పందన దళాలను వెంటనే ప్రమాద స్థలానికి తరలించినట్లు చెప్పారు. పరిస్థితిని అంచనా వేయడానికి గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, రాష్ట్ర హోం మంత్రితో మాట్లాడినట్లు అమిత్ షా వివరించారు.
అహ్మదాబాద్‌లో కూలిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం
మేఘనీనగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో కూలిన విమానం
చెట్టును ఢీకొని విమానం కూలినట్లు అనుమానాలు
అహ్మదాబాద్: విమానం కూలిన పరిసరాల్లో పెద్దఎత్తున పొగలు
– ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు
అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఏఐ171 విమానం
– టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిన ఎయిరిండియా విమానం
– ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయచర్యలు
– సహాయచర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది
– 90 మంది చొప్పున మూడు బృందాలుగా సహాయచర్యలు
– క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన సహాయ సిబ్బంది
– ప్రమాద ఘటనపై గుజరాత్ సీఎంతో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
Read Also: Plane crash: కుప్పకూలిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం