📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Pet Dog: పసిబిడ్డ ప్రాణాలను తీసిన పెంపుడు కుక్క

Author Icon By Vanipushpa
Updated: April 14, 2025 • 5:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శునకాలు అంటేనే విశ్వాసానికి ప్రతీకలుగా చెబుతుంటారు. ఎవరైనా ఒకసారి వాటికి కాస్త బువ్వ పెడితే చాలు.. వారి కోసం ఎంతకైనా తెగిస్తుంటాయి. ఇళ్లను, పొలాలను కాపాడడంతో పాటు యజమానులు ఏమైనా ప్రమాదాల్లో ఇరుక్కునా వారిని కాపాడేందుకు తెగ కష్ట పడుతుంటాయి. ఇటీవలే పులి బారి నుంచి యజమానిని రక్షిచేందుకు ఓ కుక్క ప్రాణాలే అర్పించింది. ఇదొక్కటే కాదు ఇలాంటివి ఇప్పటి వరకు చాలానే జరిగాయి. కానీ చరిత్రలో తొలిసారి.. ఓ పెంపుడు కుక్క ఇంటి యజమానులపైనే దాడికి పాల్పడింది. ముఖ్యంగా వారి 7 నెలల చిన్నారిని ఎక్కడ పడితే అక్కడ కొరికి చంపేసింది. ఈ హృదయ విదారక ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శునకాలు అంటే దంపతులకు చాలా ఇష్టం
అమెరికాలోని ఒహియోకు చెందిన మెకెంజీ కోప్లీ, కెమెరాన్ టర్నర్ దంపతులకు మొదటి నుంచి శునకాలు అంటే చాలా ఇష్టం. అయితే వీరికి పెళ్లైన తర్వాతే ఓ మూడు పిట్ బుల్స్‌ను కొనుగోలు చేసి వాటిని పెంచుకుంటున్నారు. వాటిని సొంత బిడ్డల్లా చూసుకుంటూ ప్రేమను పంచుతున్నారు. ప్రతిరోజూ ఆహారం పెట్టడం, స్నానం చేయించడం, బయటకు తీసుకెళ్లడం వంటివి కూడా చేస్తున్నారు. అయితే ఇలా మూడు శునకాలతో దంపతులు హాయిగా ఎంజాయ్ చేస్తుండగా.. ఇటీవలే దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ముఖ్యంగా ఏడు నెలల క్రితం మెకంజీ ఓ పండంటి ఆడ బిడ్డకు జన్మను ఇచ్చింది.
శిశువును ఇష్టం వచ్చినట్లు కొరికిన కుక్క
ఈక్రమంలోనే ఆ చిన్నారికి ఎలిజా అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. చిన్నారితో పాటు ఇంట్లోనే తమ పెంపుడు కుక్కలు కూడా ఉండగా.. అంతా కలిసి ఫొటోలు దిగడం, ఆడుకోవడం వంటివి చేస్తున్నారు. అంతేకాకుండా వాటిని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తూ.. తమ హ్యాపీ ఫ్యామిలీని అందరికీ చూపిస్తున్నారు. ఇదంగా బాగానే ఉండగా.. ఇటీవలే తమ మూడు పిట్‌బుల్స్ శునకాల్లో ఒకటి చిన్నారిపై దాడికి పాల్పడింది. ఏమైందో తెలియదు కానీ ఇష్టం వచ్చినట్లు శిశువును కొరికింది. దీంతో ఎలిజా విపరీతంగా ఏడ్వగా తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అప్పటికే చిన్నారి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
పోలీసుల అదుపులోకి శునకాలు
అయినా బిడ్డ ప్రాణాలతోనే ఉందేమోనన్న ఆశతో ఆస్పత్రికి పరుగులు పెట్టారు. కానీ చిన్నారి చనిపోయినట్లు తెలుసుకుని కన్నీరుమున్నీరు అయ్యారు. ఆపై వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా.. వారు వచ్చి మూడు పిట్‌బుల్స్ శునకాలను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఏ కుక్కు ఎలిజాపై దాడి చేసిందో తెలియదు కాబట్టి.. దాడి చేసిన శునకాన్ని గుర్తించేందుకు ఫ్రాంక్లిన్ కౌంటీ యానిమల్ కంట్రోల్‌కు అప్పగించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు శునకం ఏ పరిస్థితుల్లో బిడ్డపై దాడి చేసింది, ఏ కుక్క చేసిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు బిడ్డ తల్లి మొకంజీ కోప్లీ స్పందిస్తూ.. ప్రాణంగా చూసుకున్న కుక్కలే బిడ్డ ప్రాణాలు తీయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాని చెప్పారు. ఇలా జరుగుతుందని తాము కలలో కూడా ఊహించలేదని, ఎప్పుడూ బిడ్డతోనే ఉండే ఆ కుక్కలు అలా ఎలా చేశాయో తనకింకా అర్థం కావట్లేదంటూ గుండెలవిసేలా రోదించారు. మరోవైపు ఎలిజా తండ్రి కెమెరాన్ టర్నర్ మాట్లాడుతూ.. తన బిడ్డ నవ్వులు ఇంకా ఇంట్లో వినిపిస్తున్నాయని చెప్పారు. శునకాలతో ఆడుకుంటూ.. వాటిని కౌగిలించుకునే బిడ్డకు ఇలా జరగడం చూసి దిగ్భ్రాంతికి గురైనట్లు వివరించారు. సాధారణంగా యజమానుల్ని కాపాడేందుకు శునకాలు ఎంతకైనా తెగిస్తాయని తెలుసని.. కానీ అవే కుక్కలు తమ బిడ్డ ప్రాణాలు తీయడం నమ్మలేకపోతున్నామని వెల్లడించారు.

Read Also: Brice Oligui: గబాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో బ్రైస్‌ ఒలిగి విజయం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Pet dog kills toddler Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.