ఇరాన్ రాజధాని టెహ్రాన్(Tehran)ను ఇజ్రాయెల్, అమెరికా(Israel-America) లక్ష్యంగా చేసుకున్నాయి. నగరాన్ని వీడి వెళ్లిపోవాలని ఇప్పటికే అక్కడి ప్రజలకు అల్టిమేటం ఇచ్చాయి. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దాడులు తీవ్రరూపు దాల్చాయి. దీంతో టెహ్రాన్(Tehran)లోని ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ఏ క్షణంలో ఎటువైపు ఇజ్రాయెల్ బాంబులు, డ్రోన్లు పడతాయో అర్థం కాక భయంభయంగా జీవిస్తున్నారు. ఇంటర్నెట్ సర్వీసుల(Internet Service)ను ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే ఆపేసింది. ఫోన్ కాల్స్, మెసేజింగ్ సర్వీసులూ సక్రమంగా పనిచేయడం లేదు. అవి కూడా ఏ క్షణమైనా ఆగిపోవచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వలస వెళ్లిపోయిన వేలాది మంది
ఇరాన్ గగనతలంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు స్వేచ్ఛగా తిరుగుతుండటం వల్ల టెహ్రాన్ ప్రజల టెన్షన్ మరింత పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో గత మూడు రోజుల వ్యవధిలో నగరం నుంచి వేలాది మంది వలస వెళ్లిపోయారు. వారంతా టెహ్రాన్ శివారు ప్రాంతాలు, కాస్పియన్ సముద్ర పరిసర ప్రాంతాలు, అర్మేనియా, తుర్కియే లకు తరలివెళ్లినట్లు తెలిసింది. మరెంతో మంది ప్రస్తుతం టెహ్రాన్‌ను వీడి వెళ్తున్నారు. వీరి వాహనాల రద్దీతో నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌లే కనిపిస్తున్నాయి.
కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, మసీదులు
ఇప్పటికే టెహ్రాన్‌లోని చాలా ఏరియాలు ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు ప్రాణ భయం పట్టుకుంది. అయితే సొంత ఊరిని వదిలి వెళ్లేందుకు చాలామందికి మనసొప్పడం లేదు. అలాంటి వాళ్లంతా నగరంలోని మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, మసీదుల్లో తలదాచుకుంటున్నారు. ఎందుకంటే వీటినే ఇరాన్ ప్రభుత్వం షెల్టర్ జోన్లుగా ప్రకటించింది. ఇవన్నీ ప్రస్తుతం జనంతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి.
యుద్ధ ఘటనల కవరేజీని ఆపేసిన మీడియా సంస్థలు
1980వ దశకంలో ఇరాన్ – ఇరాక్ యుద్ధం జరిగే సమయానికి టెహ్రాన్‌లోని దాదాపు ప్రతీ ఇంటిలో బేస్‌మెంట్ భాగం ఉండేది. యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు వాటిలో దాచుకునేవారు. గత కొన్నేళ్లలో నగరంలో నిర్మితమైన కొత్తరకం భారీ భవనాల్లో బేస్‌మెంట్లు, షెల్టర్లు వంటి ఏర్పాట్లే లేవు. ఇజ్రాయెల్ తరహాలో ఇరాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా సురక్షిత షెల్టర్ జోన్లను నిర్మించలేదు. ప్రస్తుత యుద్ధంలో ఈ లోటు టెహ్రాన్ ప్రజలకు తెలిసొస్తోంది. 1980వ దశకంలో ఇరాన్ యుద్ధాలను ఎదుర్కొన్న సమయాల్లో టెహ్రాన్ పరిధిలో ఎయిర్ రైడ్ డ్రిల్స్ జరిగేవి.
రేపు బతికి ఉంటామో లేదో తెలియట్లేదు
‘టెహ్రాన్‌లో ఇప్పుడు ఫోన్ కాల్స్ చేయడం, మెసేజ్‌లను పంపడం కూడా కష్టతరంగా మారింది. మేం చేసే కాల్స్, మెసేజ్‌లే చివరివి అవుతాయని అనిపిస్తోంది. ఫలితంగా మా కుటుంబీకులు, బంధువులతో మనసారా మాట్లాడుకోలేకపోతున్నాం. అసలు రేపు మేం బతికి ఉంటామో లేదో అర్థం కావడం లేదు. ఇప్పటికే చాలామంది వలస వెళ్లిపోయారు. నగరం వదిలి వెళ్లిపోవడం అనేది పరిష్కారం కాదని నా ఉద్దేశం.
టెహ్రాన్‌ను వీడేందుకు సిద్ధమయ్యాం
ప్రజలు చనిపోతుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాం : టెహ్రాన్ వాస్తవ్యుడు
‘మా దేశం విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోవాలని మేం కోరుకోం. ఇరాన్‌లో ఏదైనా మార్పు వస్తే, ప్రజా ఉద్యమంతోనే రావాలి. అంతే తప్ప ఈవిధంగా దాడులతో కాదు. మా దేశంపై బాంబుల వర్షం కురుస్తుండటాన్ని, ప్రజలు చనిపోతుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాం’ అని టెహ్రాన్ నగరాన్ని వదిలి మరో ప్రాంతానికి వెళ్లిపోయిన 29 ఏళ్ల యువకుడు చెప్పుకొచ్చాడు.
Read Also: Iran: ఇరాన్ లో అధికార మార్పుపై పెరుగుతున్న ఊహాగానాలు