📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

PM Shahbaz Sharif: భారత్ తో శాంతి చర్చలకు సిద్ధం: పాక్ ప్రధాని

Author Icon By Vanipushpa
Updated: May 27, 2025 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కాశ్మీర్ సహా అన్ని సమస్యలపై చర్చలకు సిద్ధమన్న షరీఫ్
పాకిస్తాన్(Pakistan) ప్రధాని షెహబాజ్ షరీఫ్(Shahbaz Sharif), జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir), ఉగ్రవాదం, సరిహద్దు సమస్యలు వంటి అన్ని అంశాలపై భారత్‌(India)తో శాంతియుత చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఉగ్రవాద దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోన్న పరిస్థితుల్లో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
సైనిక చర్యల మధ్య అనూహ్య శాంతి సంకేతం
ఉగ్రదాడులు, సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, పాక్ ప్రధాని తాము శాంతిని కోరుకుంటున్నామని, చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు. అదే సమయంలో, అవసరమైతే తాము ధీటుగా ప్రతిస్పందిస్తామని కూడా హెచ్చరించారు.

PM Shahbaz Sharif: భారత్ తో శాంతి చర్చలకు సిద్ధం: పాక్ ప్రధాని

టర్కీ, ఇరాన్ పర్యటనల మధ్య కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం షరీఫ్ నాలుగు దేశాల పర్యటనలో ఉన్నారు. టర్కీ పర్యటన అనంతరం ఇరాన్ చేరుకున్న ఆయన, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో సమావేశమయ్యారు. సాదాబాద్ ప్యాలెస్ లో జరిగిన సమావేశంలో చర్చల అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, చొరబాట్లు, వాణిజ్యం – అన్ని అంశాలపై చర్చలకు సిద్దత
షరీఫ్ వ్యాఖ్యానంలో ఉగ్రవాదం, సరిహద్దు చొరబాట్లు, వాణిజ్యం, ఇండస్ వాటర్ ట్రీటీ వంటి అంశాలపై కూడా చర్చలు జరపాలని ఆకాంక్ష వ్యక్తమైంది. ఆయా అంశాలను శాంతియుత వాతావరణంలోనే పరిష్కరించాలనేది పాకిస్తాన్ దృక్పథమని చెప్పారు.
‘భారత్ శాంతిని కోరుకుంటే, చర్చలకు ముందుకు రావాలి’
భారత్ నిజంగా శాంతియుత పరిష్కారానికి కట్టుబడి ఉంటే, చర్చలకు ముందుకు రావాలని షరీఫ్ సూచించారు. భారత వైఖరి ఏమిటన్నది అక్కడి నాయకత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉందని వ్యాఖ్యానించారు.
ఇరాన్ మద్దతు – పెజెష్కియన్, అరఘ్చినీ ప్రశంసలు
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్, భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని అభిప్రాయపడ్డారు. దీనిపై షరీఫ్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చినీని అత్యుత్తమ దౌత్యవేత్తగా అభివర్ణించారు. తమ దేశంపై భారత్ దురాక్రమణకు పాల్పడాలను చూస్తే తమ భూ భాగాన్ని రక్షించుకోవడానికి తాము కూడా అదే మార్గంలో వెళ్తామని, ధీటుగా సమాధానం ఇస్తామని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.

ఈ విషయంలో ఆయన ఇటీవలే ఈ రెండు దేశాల మధ్య సాగిన దాడులు- ప్రతిదాడులను పరోక్షంగా ఉదహరించారు. భారత్ నిజంగా శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటోన్నట్లయితే శాంతి చర్చల ప్రతిపాదనలకు అంగీకరించాలని షరీఫ్ వ్యాఖ్యానించారు. తాము శాంతిని కోరుకుంటున్నామని, భారత్ వైఖరి ఏమిటనేది ఆ దేశ నాయకత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు పెజెష్కియన్ ఆందోళన వ్యక్తం చేయడం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించడం పట్ల షరీఫ్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చినీ ప్రశంసించారు. ఆయనను అత్యుత్తమ దౌత్యవేత్తగా అభివర్ణించారు.

Read Also: Trump: ఆపిల్ కు ట్రంప్ మరోసారి వార్నింగ్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Pakistan Prime Minister Paper Telugu News Ready for peace talks Telugu News online Telugu News Paper Telugu News Today with India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.