ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్), ఇగా స్వియాటెక్ (పోలండ్) తొలి రౌండ్ విజయాలతో టోర్నీలో శుభారంభం చేశారు.వరుసగా నాలుగో టైటిల్‌పై కన్నేసిన స్వైటెక్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో పోలెండ్ స్టార్ స్వైటెక్ 6-3, 6-3తో రెబెకా స్రాంకోవా(స్లొవేకియా)ను ఓడించింది.గంటా 24 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్వైటెక్ 25 విన్నర్స్ కొట్టడంతో పాటు 17 అనవసర తప్పిదాలు చేసింది. ఒక ఏస్ మాత్రమే కొట్టిన స్వైటెక్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. రెండో సెట్‌లో ప్రత్యర్థి రెబెకా(Rebecca) 3-1 ఆధిక్యంలోకి వెళ్ళింది. అయితే స్వైటెక్ వెంటనే పుంజుకొని వరుసగా 10 పాయింట్లు, ఆ తర్వాత ఐదు గేమ్‌లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో స్వైటెక్‌కు వరుసగా ఇది 22వ విజయం. తదుపరి రౌండ్ లో స్వైటెక్ 2021 యూఎస్ ఓపెన్ ఛాంపియన్ ఎమ్మా రాడుకానుతో తలపడుతుంది.
కరోలిన్
ఇతర మహిళల సింగిల్స్ ఫలితాల్లో పౌలా బడోసా(Paula Badosa) (స్పెయిన్) 6-7 (1/7), 6-1, 6-4 తేడాతో నవోమి ఒసాకా (జపాన్)ను ఓడించింది. ఎమ్మా రడుకాను (గ్రేట్ బ్రిటన్) 7-5, 4-6, 6-3 తేడాతో వాంగ్ జిన్యు (చైనా)పై, జెస్సికా బౌజాస్ మనీరో (స్పెయిన్) 6-0, 6-1 ఎమ్మా నావారో (అమెరికా)పై, బెర్నార్డా పెరా (అమెరికా) 6-4, 6-4 తేడాతో కరోలిన్ గార్సియాపై, కేటీ బౌల్టర్ (గ్రేట్ బ్రిటన్) 6-7 (4-7), 6-1, 6-1 తేడాతో కరోల్ మోనెట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు.
విజయం
పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాస్(Carlos Alcaraz) 6-3, 6-4, 6-2తో ఇటలీ ప్లేయర్ జెపెరిపై విజయం సాధించాడు. 1 గంట 56 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాస్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. అల్కరాస్ ఈ మ్యాచ్ లో 31 విన్నర్స్, 3 ఏస్‌లు కొట్టి, 23 అనవసర లోపాలు మాత్రమే చేశాడు.జానిక్ సిన్నర్ (ఇటలీ) – ఆర్థర్ రిండర్క్నెచ్ (ఫ్రాన్స్): సిన్నర్ 6-4, 6-3, 7-5 తేడాతో విజయం, కాస్పర్ రూడ్ (నార్వే) – ఆల్బర్ట్ రామోస్-వినోలస్ (స్పెయిన్): రూడ్ 6-3, 6-4, 6-2 తేడాతో విజయం,లొరెంజో ముసెట్టి (ఇటలీ) – యానిక్ హాన్‌ఫ్‌మాన్(Yannick Hanfmann) (జర్మనీ): ముసెట్టి 7-5, 6-2, 6-0 తేడాతో విజయం,రిచర్డ్ గ్యాస్కెట్ (ఫ్రాన్స్) – టెరెన్స్ అట్మాన్ (ఫ్రాన్స్): గ్యాస్కెట్ 6-2, 2-6, 6-3, 6-0 తేడాతో విజయం, డానియెల్ ఆల్ట్మాయిర్ (జర్మనీ) – టేలర్ ఫ్రిట్జ్ (యునైటెడ్ స్టేట్స్): ఆల్ట్మాయిర్ 7-5, 3-6, 6-3, 6-1 తేడాతో విజయం,స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీస్) – తోమస్ మార్టిన్ ఎచెవెర్రి (అర్జెంటీనా): సిట్సిపాస్ 7-5, 6-3, 6-4 తేడాతో విజయం.
Read Also : Priyank: టీమిండియా తరపున ఆడకుండానే క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పిన ప్రియాంక్