📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

UK RAF Planes: బ్రిటన్‌ ఎయిర్‌బేస్‌లోని సైనిక విమానాలపై పాలస్తీనా దాడి

Author Icon By Vanipushpa
Updated: June 21, 2025 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బ్రిటన్‌ వైమానిక(Britan Airforce) స్థావరంలోకి చొరబడి సైనిక విమానాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన​ పాలస్తీనా అనుకూలవాదుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఉగ్రవాద నిరోధక పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు. పటిష్ఠ భద్రతా వ్యవస్థను దాటుకుని వీరు రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌(Rayal Airforce Base)లోకి ఎలా ప్రవేశించారు? అనేదానిపై బ్రిటన్‌ మిలటరీ సమీక్షిస్తోంది. బ్రిటన్‌ రక్షణ శాఖ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది.

UK RAF Planes :బ్రిటన్‌ ఎయిర్‌బేస్‌లోని సైనిక విమానాలపై పాలస్తీనా దాడి

ఇంత దుస్సాహసం ఎలా చేయగలిగారు?
ఇజ్రాయెల్‌(Israel)ను విపరీతంగా ద్వేషించే, పాలస్తీనా(Palestine) అనుకూలవాదులు ఈ దుస్సాహసానికి ఒడిగట్టారు. సెంట్రల్‌ ఇంగ్లాండ్‌లోని రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్థావరంలోకి చొరబడి, రెండు సైనిక విమానాలపై దాడి చేశారు. అక్కడితో ఆగకుండా టర్బైన్‌ ఇంజిన్స్‌పై ఎరుపు రంగు పెయింట్ చల్లారు. క్రౌబార్‌లతో మరింత నష్టం కలిగించారు. విమానాల్లో ఇంధనం నింపడానికి, ఇతర రవాణా అవసరాల కోసం బ్రిటన్‌ మిలిటరీ ఈ రెండు విమానాలను ఉపయోగిస్తోంది. తమ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని బ్రిజ్‌ నార్టన్‌ ఎయిర్‌ బేస్‌లోకి చొరబడి వాయేజర్ జెట్‌లను ధ్వంసం చేసినట్లు పాలస్తీనా యాక్షన్‌ గ్రూప్‌ అంగీకరించింది. ఎలక్ట్రిక్‌ స్కూటర్లతో ఎయిర్‌ఫోర్స్‌ స్థావరంలోకి చొరబడ్డ నిందితులు విమానాలకు నష్టం కలిగించిన వెంటనే అక్కడ నుంచి పరారయ్యారు. రన్‌వేపైనా పెయింట్‌ వేసినట్లు, పాలస్తీనా పతాకాన్ని అక్కడ వదిలివెళ్లినట్లు పాలస్తీనా యాక్షన్‌ గ్రూప్‌ తెలిపింది.

ఇజ్రాయెల్​కు బ్రిటన్ సహకారం!
గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను బ్రిటన్‌ బహిరంగంగా ఖండించినప్పటికీ, పరోక్షంగా ఆ దేశానికి మద్దతిస్తూనే ఉందని పాలస్తీనా అనుకులవాదులు ఆరోపిస్తున్నారు. సైనిక సరకులను పంపడం, గాజాపై నిఘా విమానాలను ఎగురవేయడం, అమెరికా- ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలకు ఇంధనం నింపడం వంటి చర్యలను బ్రిటన్‌ కొనసాగిస్తోందని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ సైనిక విమానాలను ధ్వంసం చేసినట్లు పాలస్తీనా యాక్షన్‌ గ్రూప్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది. గాజాలో మారణహోమానికి, మధ్యప్రాశ్చ్యంలో యుద్ధ నేరాలకు బ్రిటన్‌ పాల్పడుతోందని విమర్శించింది.

దర్యాప్తు ముమ్మరం
సైనిక స్థావరంలోకి ఆ ఇద్దరు నిందితులు ఎలా ప్రవేశించారన్న దానిపై దర్యాప్తు చేపట్టినట్లు బ్రిటన్‌ పోలీసువర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. బ్రిటన్‌ రక్షణ శాఖ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. భద్రతను సమీక్షిస్తోంది. బ్రిటన్ గాజాపై ఇజ్రాయెల్ దాడులను బహిరంగంగా ఖండించినా, ప్రత్యక్షంగా మద్దతు ఇస్తోందని పాలస్తీనా అనుకూలవాదులు ఆరోపిస్తున్నారు. RAF వాయేజర్ జెట్‌లు ఇజ్రాయెల్‌కు సైనిక సప్లైలు, నిఘా, ఇంధనం నింపే పనులకు ఉపయోగించబడుతున్నాయని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో RAF జెట్‌లపై దాడి చేసినట్లు గ్రూప్ ఒక ఎక్స్ పోస్ట్ ద్వారా తెలిపింది. బ్రిటన్ రక్షణ శాఖ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. RAF స్థావరాల భద్రతా మౌలిక సదుపాయాలను సమీక్షిస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా సాంకేతిక భద్రత, శారీరక పర్యవేక్షణను మరింత పటిష్టం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: Yoga Day : రేపు 191 దేశాల్లో యోగా డే ఈవెంట్లు

#BritishAirForce #IsraelGazaConflict #PalestineSupporters #RAFBaseAttack #telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.