📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Pakistan: భారత్‌తో మళ్లీ పాకిస్తాన్‌ యుధ్దం.. మాజీ లెఫ్టినెంట్ జనరల్ వ్యాఖ్యలు

Author Icon By Vanipushpa
Updated: June 6, 2025 • 12:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-పాకిస్తాన్(India-Pakistan) మధయ యుధ్దం ముగిసిపోలేదని భవిష్యత్తులో ఎప్పుడైనా రావొచ్చని మాజీ లెఫ్టినెంట్ జనరల్ హెచ్‌ఎస్ పనాగ్(Panaag) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం భారత్ సిధ్దంగా ఉండాలని సూచించారు. ఆపరేష్ సింధూర్(Operation Sindoor) తర్వాత ఇరు దేశాల మధ్య యుధ్ధం ఆగిపోయిన సంగతి విదితమే. జమ్మూకాశ్మీర్లో 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రకటించింది.
ఆ ఐదు అంశాల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం
పాకిస్తాన్ లో దాక్కున్న ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ఈ మిషన్ ప్రారంభించింది. అయితే ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాయి. ఈ సమయంలో పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం సైనిక చర్యల పరిధిలోనే ఉంటుందని, సింధు నదీ జలాల ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేత సహా ఆ ఐదు అంశాల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Pakistan: భారత్‌తో మళ్లీ పాకిస్తాన్‌ యుధ్దం.. మాజీ లెఫ్టినెంట్ జనరల్ వ్యాఖ్యలు

దాయాది దేశంతో యుధ్దానికి సిద్ధం
అయితే ఇప్పుడు తాజాగా మాజీ లెఫ్టినెంట్ జనరల్ హెచ్‌ఎస్ పనాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఐదు నుండి పది సంవత్సరాలలో భారతదేశం మళ్ళీ దాయాది దేశంతో యుధ్దానికి సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు ది ప్రింట్ లో ఆయన వ్యాసం రాసారు. ఈ సారి జరగబోయే యుద్ధంలో దాయాది దేశానికి చైనా కూడా మద్ధతు ఇచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్ రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి భారతదేశం కొన్ని చర్యలు తీసుకోవలసి ఉంటుందని వ్యాసంలో పేర్కొన్నారు. రక్షణ బడ్జెట్‌ను GDPలో 4%కి రెట్టింపు చేయడంతో సహా పలు కీలక అంశాలను ఆయన వ్యాసంలో తెలిపారు.
పాకిస్తాన్ కు చైనా మద్దతు
ఇది మొత్తం కేంద్ర బడ్జెట్‌లో దాదాపు 13.45%గా ఉంది. ఈ బడ్జెట్‌లో ఎక్కువ భాగం (సుమారు రూ. 1.80 లక్షల కోట్లు) సాయుధ దళాల ఆధునీకరణతో పాటు వారికి కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధనౌకల సేకరణ వంటి వాటి కోసం కేటాయించారు. దేశీయ రక్షణ పరిశ్రమల నుండి సేకరణ కోసం ప్రభుత్వం ఈ మొత్తాన్ని (రూ. 1.12 లక్షల కోట్లు) కేటాయించింది. చైనా ఎప్పుడూ భారతదేశానికి ప్రధాన శత్రువేనని పనాగ్ తెలిపారు. పాకిస్తాన్ కన్నా చైనా చాలా డేంజర్ అని చెప్పుకొచ్చారు.పాకిస్తాన్ మళ్ళీ బలంగా మారి భారత్ మీద కయ్యానికి కాలు దువ్వితే.. చైనా దానికి మద్దతు ఇస్తుందని యుద్ధ తీవ్రత పెరుగుతుందని పనాగ్ తెలిపారు. వచ్చే 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ మధ్యలో యుధ్దం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

Read Also: Mohan Bhagwat: పహల్గామ్ దోషులకు సరియైన శిక్షే: మోహన్ భగవత్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Former Lieutenant General's comments Google News in Telugu Latest News in Telugu Pakistan's war Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today with India again..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.