📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pak journalist: తమ సైన్యం తప్పుడు ప్రచారం చేసిందని అంగీకరించిన పాక్ జర్నలిస్ట్

Author Icon By Anusha
Updated: May 14, 2025 • 11:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరంలో పర్యటించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి ముచ్చటించిన ప్రధాని మోదీ అక్కడి నుంచే పాకిస్తాన్‌కు గట్టి సందేశం పంపించారు. భారత్‌కు చెందిన అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్(Air defense system) అయిన ఎస్-400 మిసైల్ సిస్టమ్‌ను ధ్వంసం చేశామని పాకిస్తాన్ అబద్ధాలు చెబుతుండగా అదంతా తప్పేనని నిరూపించేందుకు ఎస్-400 మిసైల్ సిస్టమ్ ముందు నిలబడి ప్రధాని ప్రసంగించారు.ఈ నేపథ్యంలో, పాకిస్థాన్‌కు చెందిన ఒక జర్నలిస్టు స్వయంగా తమ దేశ సైనిక అధికార ప్రతినిధి (డీజీ-ఐఎస్‌పీఆర్) అహ్మద్ షరీఫ్ చౌదరిపై విరుచుకుపడ్డారు. తప్పుడు విజయాలు ప్రకటించుకుంటున్నారని, వాస్తవానికి భారత దళాలు పాకిస్థాన్‌లోని కీలక స్థావరాలపై దాడులు చేశాయని ఆయన అంగీకరించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, సదరు పాకిస్థానీ జర్నలిస్టు ఆదంపూర్ ఎయిర్‌బేస్‌(Adampur Airbase)లో ఎస్-400 క్షిపణి వ్యవస్థ ముందు నిలబడి ఉన్న ప్రధాని మోదీ చిత్రాన్ని చూపుతూ మాట్లాడారు. “ఈ స్థావరాన్ని, ఈ ఎస్-400 వ్యవస్థను మేం నాశనం చేశామని చెప్పుకున్నాం. కానీ, నరేంద్ర మోదీ అదే ఎస్-400 ముందు నిలబడి తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మేం గెలవలేదు. 1971 తర్వాత భారతదేశం పాకిస్థాన్‌లోని ప్రతి నగరం, ప్రతి స్థావరంపై దాడి చేయగలదని నిరూపించింది. మీ దేశంలో ఏ మూల కూడా సురక్షితం కాదని మోదీ పాకిస్థాన్‌కు గట్టి సందేశం ఇచ్చారు,” అని ఆ జర్నలిస్టు పేర్కొన్నారు. మోదీ తమ నీటి సరఫరాను నిలిపివేశారని, తమవారిలో 50 మందిని హతమార్చారని కూడా ఆయన ఆరోపించారు.

నినాదం

ఈ సందర్భంగా ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో పర్యటించిన ప్రధాని మోదీ అక్కడి సైనికుల ధైర్యపరాక్రమాలను ప్రపంచానికి చాటి చెబుతూ వారికి సెల్యూట్ చేశారు. భారత్‌ మాతాకీ జై అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ ఆ నినాదం ప్రస్తుతం శత్రువుల చెవుల్లో మారుమోగిపోతోందని తెలిపారు. ఆ నినాదమే ఇప్పుడు శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిందని పేర్కొన్నారు.

Read Also : TRUMP: సౌదీ అరేబియాలో ట్రంప్ మాటల తూటాలు

#AdampurAirbase #IndianAirForce #IndianDefence #S400 Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.