పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే కీలకమైన సింధూ నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేసిన భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్ ఎయిర్‌లైన్లకు ఇది మరింత శరాఘాతం కానుంది.
ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు అమలు
రెండు దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలోనే పాక్ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలపై నిషేధం విధించడంపై భారత్ కూడా దీటుగా స్పందించింది. పాక్ విమానయాన సంస్థలకు భారత గగనతలాన్ని మూసివేసింది. ఇందుకు సంబంధించి నోటమ్ జారీ చేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు అమలులో ఉండనుంది. దీంతో పాక్‌కు సంబంధించిన కమర్షియల్, లీజుకు తీసుకున్న, సైనిక విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకోవవడానకి అవకాశం లేదు.
చైనా, శ్రీలంక గుండా దూరప్రయాణం
భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్థాన్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేసియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయ్‌లాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా, శ్రీలంక గుండా దూరప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా నిర్వహణకు అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్‌లైన్లకు ఇది మరింత శరాఘాతం కానుంది. ఈ నిర్ణయం, రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ, సైనిక సంబంధాలను మరింత సంక్షోభం తీసుకురావచ్చు. పాకిస్థాన్ విమానయాన సంస్థలు దీని వల్ల ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు కొత్త మార్గాలను అన్వేషించవలసి ఉంటుంది.
పాకిస్థాన్ ఎయిర్‌లైన్లపై ఆర్థిక ప్రభావం
ఈ నిర్ణయంతో పాకిస్థాన్ ఎయిర్‌లైన్లకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్ విమానాలు మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్ వంటి గమ్యస్థానాలకు వెళ్లడానికి చైనా, శ్రీలంక గుండా దూరప్రయాణం చేయాల్సి ఉంటుంది.
Read Also: Sundar Pichai: సుందర్ పిచాయ్ సక్సెస్ కు భార్య అంజలినే కారణమా!