📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: ప్రియుడి కోసం 27 మందిని చంపిన యువతి

Author Icon By Vanipushpa
Updated: July 5, 2025 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల ప్రేమలకోసం మర్డర్ లు బాగా పెరిగిపోతున్నాయి. తాము కోరుకున్నది దక్కించుకోవడానికి మనుషులు ఎంతకైన తెగిస్తున్నారు. అందుకు అడ్డు వస్తే తల్లి, తండ్రి, పిల్లలు ఇలా ఎవరినైనా సరే అంతమొందిస్తున్నారు. ఇటీవల వరుసగా ఇవే ఘటనలు ఎదురవుతున్నాయి. అయితే ఈ ఘటన జరిగి చాలా కాలం అవుతున్నప్పటికీ ఇప్పుడు జరుగుతున్న ఘటనల నేపథ్యంలో మరోసారి ట్రెండింగ్‌గా మారింది. తన ప్రియుడితో పెళ్లికి తల్లి అడ్డంగా ఉందని భావించి తల్లినే చంపిందో పదవతరగతి విద్యార్థిని. ఇలాంటి ఘటనే పాకిస్థాన్‌(Pakistan)లో చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఏకంగా 27 మంది కుటుంబ సభ్యులను పొట్టన పెట్టుకుందో యువతి. పాకిస్థాన్‌లో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

Pakistan: ప్రియుడి కోసం 27 మందిని చంపిన యువతి

అసియా బీబీ సీరియస్‌ వార్నింగ్‌
పాకిస్తాన్ ముజఫ్ఫర్‌గఢ్‌(Muzaffargarh)కు చెందిన అసియా బీబీ(Aasiabibi) అనే యువతికి కుటుంబ సభ్యులు పెళ్లి సెటిల్‌ చేశారు. అయితే ఆ పెళ్లి ఆమెకు ఏ మాత్రం ఇష్టం లేదు. కారణం తనకు భాయ్ ఫ్రెండ్‌ ఉండడమే. దీంతో చాలా కఠిన నిర్ణయం తీసుకుంది. ఏకంగా కుటుంబంలోని 27 మందికి విషం పెట్టి చంపేసింది. తనకు పెళ్లి ఫిక్స్‌ చేసిన సమయంలోనే ఆ పెళ్లి నాకు ఇష్టం లేదని నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నానని అసియా బీబీ చెప్పింది. ఆయనతో తన పెళ్లి చేయాలని కూడా కోరింది. అయితే కుటుంబసభ్యులు మాత్రం తమ బంధువు అయిన అజ్మద్‌తో మ్యారేజ్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ విషయంలో అసియా బీబీ సీరియస్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చింది. తనకు ఇష్టం లేని పెళ్లిచేస్తే ఏమైనా చేస్తానని హెచ్చరించింది. అయినా కుటుంబ సభ్యులు వినలేదు.

పాలల్లో ఎలుకల మందు

దీంతో కుటుంబ సభ్యులు తాగే పాలల్లో ఎలుకల మందు కలిపింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోలేనని నిర్ణయించుకున్న అసియా బీబీ తనను పెళ్లి చేసుకోబోయే అజ్మద్‌తో సహా అందరికీ విషం కలిపిన పాలు ఇచ్చింది. దీంతో వారంతా అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో అజ్మద్‌తోసహా 18 మంది అస్వస్థతకు గురయ్యారు.. వారిలో అజ్మద్ అన్నలు, వదినలతో సహా తొమ్మిది మంది మరణించినట్లు తెలిసింది. కాగా ఈ కేసులో అసియాబీబీతో పాటు ఆమె ప్రియుడు షాహిద్ హస్తం కూడా ఉందని తేలింది. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Pune: పూణే అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్..

#telugu News Ap News in Telugu Breaking News in Telugu crime of passion female killer Pakistan Google News in Telugu Latest News in Telugu love affair murder Pakistan mass murder for lover Pakistan crime news Pakistan murder case Pakistani woman criminal Paper Telugu News sensational murder news shocking crime Pakistan Telugu News online Telugu News Paper Telugu News Today woman kills 27

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.