📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan Stock Market: పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ సైట్ క్రాష్..ఇన్వెస్టర్లకు భయం

Author Icon By Vanipushpa
Updated: April 25, 2025 • 2:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భరత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పోర్టల్ వెబ్‌సైట్ ఒక్కసారి క్రాష్ అయ్యింది. వరుసగా రెండు రోజుల పాటు PSX ఇండెక్స్ తీవ్ర పతనాన్ని చుసిన తర్వాత ఇవాళ వెబ్‌సైట్ క్రాష్ అయింది. నిన్న గురువారం, KSE-100 ఇండెక్స్ ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి ఐదు నిమిషాల్లోనే 2.12% అంటే 2,485.85 పాయింట్లు కుప్పకూలి 114,740.29 వద్ద ముగిసింది. బుధవారం కూడా ఇదే విధమైన పతనం తర్వాత, కేవలం రెండు రోజుల్లోనే మొత్తం 2,500 పాయింట్లకు పైగా క్షీణత నమోదైంది.

గురువారం కూడా కొనసాగి తీవ్ర క్షీణత
PSX వెబ్‌సైట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే “WE’LL BE BACK SOON” అని ఒక మెసేజ్ చూపిస్తుంది, అలాగే నెక్స్ట్ నోటీసు వచ్చే వరకు మెయింటెనెన్స్’లో ఉందని సూచిస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పాకిస్తాన్ GDP వృద్ధి అంచనాను 2.6%కి తగ్గించిన తర్వాత బుధవారం PSX నష్టాల్లో ముగిసింది, అంతేకాక ఈ పతనం గురువారం కూడా కొనసాగి తీవ్ర క్షీణత సంభవించింది.
పాకిస్తానీ జాతీయులకు వీసాల రద్దు
పాకిస్తాన్ కరెన్సీ బలహీనపడటం, రాజకీయ అనిశ్చితి కొనసాగడం, పెరుగుతున్న భద్రతా ప్రమాదాలు ముఖ్యంగా కాశ్మీర్‌లో ఆర్థిక మార్కెట్లలో సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయని ఫిచ్ రేటింగ్స్ తాజాగా ఆందోళనలను వ్యక్తం చేసింది. కాశ్మీర్ ఫాల్గమ్ దాడికి బదులుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కఠినమైన చర్యలు ప్రకటించింది, వాటిలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, వాఘా-అట్టారి బార్డర్ ద్వారా వాణిజ్యాన్ని వెంటనే మూసివేయడం, సార్క్ కింద పాకిస్తానీ జాతీయులకు వీసాల రద్దు వంటివి ఉన్నాయి.
ఈ ఉద్రిక్తతల మధ్య ఇవాళ భారతదేశ దలాల్ స్ట్రీట్ కూడా దాదాపు 500 పాయింట్లు పడిపోయింది.
Read Also: Donald Trump: పహల్గాం దాడి..భారత్​కు అండగా ఉంటామన్న ట్రంప్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu investors panic Latest News in Telugu Pakistan stock market Paper Telugu News site crashes Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.