📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India Pakistan: కష్టాల అంచున పాకిస్థాన్..కేజీ చికెన్ రూ.800

Author Icon By Vanipushpa
Updated: April 28, 2025 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రస్తుతం ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతుంది. పహల్గామ్‌లో తీవ్రవాదులు కాల్పుల దాడికి పాల్పడటంతో ఒక విధంగా తనకు తానుగా సమాధి తవ్వుకున్నట్టు అయ్యింది. ద్రవ్యోల్బణం కారణంగా మన పక్క దేశం అయినా పాకిస్థాన్లో తీవ్ర గందరగోళం నెలకొంది. తాజాగా చూస్తే పాకిస్తాన్‌లో బియ్యం కిలో రూ.340కి, చికెన్ కిలో రూ.800కి అమ్ముతున్నారు. దింతో భారతదేశ వాణిజ్య నిషేధం తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు లోతైన సంక్షోభంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది.

ద్రవ్యోల్బణ ప్రభావం..ప్రజలపై మరింత భారం
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్‌తో వాణిజ్యాన్ని నిషేధించిన సంగతి మీకు తెలిసందే. అయితే ఈ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. భారతదేశ ఈ చర్య కారణంగా ద్రవ్యోల్బణ ప్రభావం అక్కడి ప్రజలపై మరింత భయంకరంగా మారింది.
3800 కోట్ల వ్యాపారం: 2023 సంవత్సరంలో భారతదేశం అండ్ పాకిస్తాన్ మధ్య అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా దాదాపు రూ.3800 కోట్ల విలువైన వాణిజ్యం జరిగింది అంటే దీని బట్టి మీరు అంచనా వేయవచ్చు. ఇందులో మందులు, కోళ్ల మేత, పండ్లు, కూరగాయలు అలాగే రసాయనాలు ఉన్నాయి. కానీ పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం ఈ సరిహద్దు చెక్ పోస్ట్‌ను లాక్ చేసింది. పాకిస్తాన్ ఫార్మా పరిశ్రమ 30 నుండి 40 శాతం ముడి పదార్థాల కోసం భారతదేశంపై నేరుగా ఆధారపడి ఉంది. భారతదేశం నుండి సప్లయ్ ఆగిపోయిన వెంటనే పాకిస్తాన్‌లో వైద్య సంక్షోభం తీవ్రతరం కావడం మొదలైంది. నివేదికల ప్రకారం, పాకిస్తాన్ ఆరోగ్య అధికారులు ఇప్పుడు మందుల సప్లయ్ ఎలాగైనా నిర్వహించగలిగేలా ఏమార్చెన్సీ ప్లాన్స్ రూపొందిస్తున్నారు.
రూ.800కి అమ్ముతున్న కిలో చికెన్
మన పక్క దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితి ఎలా ఉందంటే, చికెన్ కిలో రూ. 800 (PKR)కి, బియ్యం కిలో రూ. 340కి అమ్ముతున్నారు. అంతే కాకుండా, పాలు లీటరుకు రూ.224కు లభిస్తాయి. సింధు జల ఒప్పందంపై నిషేధం కారణంగా నీటి సంక్షోభం కూడా తీవ్రమైంది. నేడు పరిస్థితి ఎలా ఉందంటే వాటర్ బాటిల్ ధర పాకిస్తానీ కరెన్సీ తో పోల్చితే రూ.105 చేరుకుంది. ఇలాంటి పరిస్థితిలో రాబోయే రోజుల్లో పాకిస్తాన్‌లోని సామాన్య ప్రజల జీవితం మరింత కష్టంగా మారవచ్చు. భారతదేశం తీసుకున్న నిర్ణయాల ప్రభావం పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ దేశ స్టాక్ మార్కెట్ రోజురోజుకి మరింతగా దిగజారుతోంది అంతేకాకుండా పెట్టుబడిదారులు కుడ డబ్బును కోల్పోతున్నారు. మరోవైపు, పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు కూడా $15.75 బిలియన్లకు తగ్గిపోయాయి.

Read Also: Phalgam Terror Attack: పహల్గామ్ దాడిని ఖండించిన ఐక్యరాజ్యసమితి

#telugu News A kilogram of chicken costs Rs. 800 Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Pakistan on the brink of trouble Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.