గతరెండు రోజుల క్రితం పాకిస్తాన్,(Pakistan) సౌదీ అరేబియాల మధ్య జరిగిన సైనిక ఒప్పందంతో భారత్ అలర్ట్ అయ్యింది. ఏ దేశంలో దాడి జరిగినా అది రెండు దేశాలమధ్య దాడిగా పరిణిస్తూ చేసుకున్న ఒప్పందంలో భాగంగా రెండుదేశాల మధ్య సైనిక విన్యాసాలు(acrobatics) జరగనున్నాయి. దీంతో భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందాలు భారత్ పై పడే ప్రభావాన్ని నిశితంగా పై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జాతీయ భద్రత, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలను గమనిస్తున్నట్లు రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. భారత జతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

రెండు దేశాల మధ్య డిఫెన్స్ టెక్నాలజీ షేరింగ్
సౌదీ రాజధాని రియాద్ లోని యమనా ప్యాలెస్ లో ఇరుదేశాల మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్, సౌదీ అరేబియా(Saudi Arabia) మధ్య సైనిక విన్యాసాలు జరగనున్నాయి. అడ్వాన్స్ డ్ డిఫెన్స్ టెక్నాలజీని(Technology) ఇరుదేశాలు ఇచ్చిపుచ్చుకోనున్నాయి. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్,(Prime Minister Shehbaz Sharif,) ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ లు సౌదీ అరేబియాలో పర్యటించారు. ఈ మేరకు ఇరుదేశాల మధ్య భారీ రక్షణ ఒప్పందాలు కుదిరాయి. అలాగే ఇంటెలిజెన్స్ విభాగాన్ని కూడా షేరింగ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం బయటి దేశాలకు ఓ దఢమైన సందేశం అని పాకిస్తాన్ పేర్కొంది.
పాకిస్థాన్-సౌదీల మధ్య సైనిక విన్యాసాల లక్ష్యం ఏమిటి?
ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాలను పెంచుకోవడం, ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాలను బలోపేతం చేసుకోవడం ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం.
ఈ విన్యాసాలపై భారత్ స్పందన ఏమిటి?
ప్రాంతీయ భద్రతకు విఘాతం కలిగించే చర్యలను ప్రోత్సహించకూడదని భారత్ ఈ సందర్భంగా ఉద్ఘాటించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: